
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక రాక్ స్టార్ ఉన్నారు. ఆమె గాత్రానికి దేశం మొత్తం ఫిదా అవుతుంది. మధురమైన గొంతుతోపాటు అందంలోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఒంటరితనం, విడాకులు, పెళ్లి.. ఇలా ఎన్నో సవాళ్లు దాటుకుని తన జీవితాన్ని సాగిస్తుంది. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆమె ముఖంలో చిరునవ్వు మాత్రం చెరగదు. ఎప్పుడూ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, గాత్రంతో శ్రోతలను కట్టిపడేస్తుంది. మనం మాట్లాడుకుంటున్న ఆ సింగర్ పేరు సునిధి చౌహాన్. గత కొన్నేళ్లుగా తన గాత్రంతో అభిమానులను మంత్రముగ్దులను చేస్తుంది. ఆమె 5 సంవత్సరాల వయసులో పాడడం ప్రారంభించింది. 13 సంవత్సరాల వయస్సులో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి, అతి త్వరలోనే దేశంలో నంబర్ 1 గాయనిగా మారింది.
ఎక్కువమంది చదివినవి : Tanikella Bharani: అలాంటి హీరోను నా జీవితంలో చూడలేదు.. ఆయన వల్లే నా జీవితం మారిపోయింది.. తనికెళ్ల భరణి..
. శాస్త్రీయ సంగీతం అయినా, ఆధునిక రాక్ బ్యాండ్‌లు అయినా, సునీధి తనదైన ముద్ర వేసింది. ఈరోజు సునిధి వ్యక్తిగత జీవితంలో ఒక తుఫాను వచ్చి ఆమె జీవితాన్ని పూర్తిగా అతలాకుతలం చేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, సునిధి తన మొదటి వివాహం గురించి, అది కలిగించిన బాధ గురించి చెప్పుకొచ్చింది. కేవలం 18 ఏళ్ల వయసులోనే తన జీవితంలోనే అతిపెద్ద, అంతే వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుంది. తనకంటే 13 ఏళ్లు పెద్దవాడైన ముస్లిం కొరియోగ్రాఫర్ బాబీ ఖాన్‌ను సునీధి వివాహం చేసుకుంది. అయితే, సునీధి నిర్ణయాన్ని ఆమె తండ్రి వ్యతిరేకించారు. ఆ సమయంలో తన కుటుంబం గురించి ఏమాత్రం ఆలోచించకుండా బాబీ ఖాన్‌ను వివాహం చేసుకుంది. అయితే, ఈ నిర్ణయం సునీధి జీవితంపై పెద్ద ప్రభావాన్ని చూపింది. ఈ వివాహం ఆమె వ్యక్తిగత జీవితంలో పెను మార్పులు తీసుకురావడమే కాకుండా, ఆమె కెరీర్‌ను కూడా ప్రభావితం చేసింది.
ఎక్కువమంది చదివినవి : Baahubali 2 : బాహుబలి 2లో నేను చేసిన సీన్స్ అన్నీ తీసేసారు.. అయినా ఫేమస్ అయ్యా.. టాలీవుడ్ నటుడు..
పెళ్లయిన కొన్ని నెలల్లోనే వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఏడాదిలోపే వారు విడాకులు తీసుకున్నారు. “నేను నా జీవితంలో చాలా తప్పులు చేశాను, కానీ బాబీ ఖాన్‌ను పెళ్లి చేసుకోవడం నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. అదృష్టవశాత్తూ, నేను తప్పుడు చోట చిక్కుకుపోయానని సమయానికి గ్రహించాను. దేవుడి దయవల్ల, అక్కడి నుంచి బయటపడే వివేకం నాకు కలిగింది.” అని అన్నారు సునీధి. ప్రస్తుతం సినీరంగంలో గాయనిగా దూసుకుపోతుంది.
ఎక్కువమంది చదివినవి : Tollywood : మొన్నటిదాక తోపు సింగర్.. ఇప్పుడు స్పెషల్ పాటతో గ్లామర్ బీభత్సం.. ఎవరో గుర్తుపట్టారా.. ?