హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. దీర్ఘకాలంగా ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడమే ఇందుకు కారణం. లక్షల్లో పన్ను బకాయిలు పేరుకుపోవడంతో పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన రాలేదు. జయలలిత మరణానంతరం ఆస్తి నిర్వహణపై స్పష్టత లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది.