AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: పరివర్తన యోగం.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆదాయం..!

ఏప్రిల్ 11 నుంచి 30 వరకు బుధుడు తనకు నీచ స్థానమైన మీన రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. అయితే, గురు, బుధుల మధ్య పరివర్తన యోగం వల్ల బుధుడికి నీచ భంగం జరిగింది. గురువు అధిపతి అయిన మీన రాశిలో బుధుడు ప్రవేశించడం, బుధుడు అధిపతి అయిన మిథునంలో గురువు సంచారం చేయడం వల్ల ఈ పరివర్తన యోగం కలిగింది. ఈ పరివర్తన వల్ల వృషభం, మిథునం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి దాదాపు అన్ని విధాలు గానూ అదృష్టం పడుతుంది. ఈ రెండు గ్రహాలు ఆదాయానికి సంబంధించిన గ్రహాలే కనుక తప్పకుండా ఆదాయ వృద్ధి ఉంటుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 31, 2026 | 5:14 PM

Share
వృషభం: ఈ రాశికి ధనాధిపతి అయిన బుధుడికి, లాభాధిపతి అయిన గురువుకు పరివర్తన జరుగుతున్నందువల్ల ఈ రాశివారు దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపారంగా కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంది. జీతభత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు తప్పకుండా సంభవిస్తాయి. అనుకోకుండా ఆస్తి, భూలాభం కలుగుతాయి.

1 / 6
మిథునం: రాశ్యధిపతి బుధుడికి, దశమాధిపతి గురువుకు మధ్య పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారికి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఉన్నత వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.  వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.

2 / 6
కన్య: ఈ రాశికి సప్తమ, దశమ స్థానాల మధ్య పరివర్తన జరగడం వల్ల ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు రాబడిలో అంచనాలను దాటుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం మారే ప్రయత్నాలు ఫలిస్తాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న ఉద్యోగులు విజయం సాధిస్తారు.

3 / 6
ధనుస్సు: ఈ రాశివారికి చతుర్థ, సప్తమ స్థానాల మధ్య పరివర్తన జరగడం వల్ల గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మనసులోని ముఖ్యమైన కోరికలన్నీ నెరవేరుతాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలుగుతాయి. ఇంటా బయటా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

4 / 6
కుంభం: ఈ రాశివారికి ద్వితీయ, పంచమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ధన ధాన్య సమృద్ధి యోగం పడుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు అనేక అరుదైన అవకాశాలు లభిస్తాయి. విదేశీ యానానికి ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగపరంగానే కాక, ఆర్థికంగా కూడా స్థిరత్వం లభిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఆశించిన శుభ వార్తలు వింటారు. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది.

5 / 6
మీనం: ఈ రాశినాథుడైన గురువుతో చతుర్ధాధిపతి బుధుడికి పరివర్తన జరుగుతున్నందువల్ల, ఆస్తి లాభం, భూ లాభం కలిగే అవకాశం ఉంది. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి.

6 / 6
Follow Us