Cinema : ఈ ఏడాదిలో పెద్ద డిజాస్టర్ సినిమా ఇదే.. రూ.70 కోట్లు పెడితే రూ.1 కోటి మాత్రమే వచ్చాయి..

ఈమధ్య కాలంలో భారీ బడ్జెట్, స్టార్ హీరోలతో పాన్ ఇండియా లెవల్లో సినిమాను నిర్మించేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ కంటెంట్ నచ్చితే చాలు చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. అయితే ఎన్నో అంచనాల మధ్య రూపొందించిన కొన్ని సినిమాలు మాత్రం ఊహించని స్థాయిలో డిజాస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సినిమా కూడా అదే జాబితాలోకి చెందినది.

Cinema : ఈ ఏడాదిలో పెద్ద డిజాస్టర్ సినిమా ఇదే.. రూ.70 కోట్లు పెడితే రూ.1 కోటి మాత్రమే వచ్చాయి..
Vrusshabha Movie

Updated on: Dec 30, 2025 | 4:04 PM

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుంది. భారీ బడ్జెట్ సినిమాలను అంతకు మించిన అంచనాలతో నిర్మిస్తున్నారు మేకర్స్. ఈ ఏడాది ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. కానీ అందులో కోట్లు పెట్టిన సినిమాల కంటే.. చిన్న చిత్రాలే సత్తా చాటాయి. 2025లో పలు సినిమాలు హిట్టయ్యాయి… మరికొన్ని ప్లాప్ అయ్యాయి. అయితే ఓ స్టార్ హీరో కెరీర్ లో ఊహించని రిజల్ట్ ఇచ్చింది ఈ సినిమా. దాదాపు రూ.70 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా.. రూ.1 కోటి కూడా వసూలు చేయలేదు. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు వృషభ. మలయాళీ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు మందు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ ఏడాది వరుస హిట్స్ అందుకుంటున్న మోహన్ లాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి : Vinay Rai: అప్పుడు హీరోగా.. ఇప్పుడు విలన్‏గా.. ఈ నటుడి ప్రియురాలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే.

వృషభ సినిమాకు కన్నడ డైరెక్టర్ నంద కిషోర్ దర్శకత్వం వహించారు. దాదాపు రూ.70 కోట్లతో నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 25న అడియన్స్ ముందుకు వచ్చింది. క్రిస్మస్ సందర్భంగా విడుదలైన ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. మలయాళంతోపాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. విడుదలకు ముందు మంచి హైప్ సంపాదించుకున్న ఈ చిత్రం చివరకు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమాకు తెలుగులో అంతగా రెస్పాన్స్ కూడా రాలేదు. ఇప్పటివరకు కేవలం మలయాళంలో రూ.1 కోటి వరకు వసూలు చేసినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి :  The Paradise: కాంబో అదిరింది భయ్యా.. నానితో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ది ప్యారడైజ్ నుంచి క్రేజీ అప్డేట్..

ఈ చిత్రంలో మోహన్ లాల్ ద్విపాత్రాభినయం చేశారు. అటు రాజా విజయేంద్ర వృషభగా, మరోవైపు బిజినెస్ మెన్ ఆది దేవ వర్మ పాత్రలలో కనిపించి మరోసారి తన నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఇందులో సిమర్ జీత్ లంకేశ్, నయన్ సారిక, రాగిని ద్వివేది, అజయ్, నేహా సక్సేనా, ఆలీ వంటి నటీనటులు కీలకపాత్రలు పోషించారు. బ్యాక్ టూ బ్యాక్ విభిన్న కంటెంట్ చిత్రాలతో హిట్స్ అందుకుంటున్న మోహన్ లాల్.. ఈ ఏడాది చివర్లో మాత్రం వృషభ మూవీతో డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నారు.

ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్‏లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..