ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..

సినీరంగంలో ఎవర్ గ్రీన్ హిట్ మూవీస్ చాలా ఉన్నాయి. సంవత్సరాల క్రితం చాలా విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు.. ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అప్పట్లో థియేటర్ హిట్స్.. ఇప్పుడు టీవీల్లోనూ మెప్పిస్తున్నాయి.

ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..
Chandramukhi Movie

Updated on: Jan 24, 2026 | 11:24 AM

కొన్ని సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సంవత్సరాలు గడిచినప్పటికీ ఆ చిత్రాలకు ఉండే క్రేజ్ మాత్రం తగ్గదు. అప్పట్లో థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన సినిమాలు వస్తే టీవీలకు అతుక్కుపోతుంటారు. అదే విధంగా అనేక చిత్రాలు జనాల మనసులు గెలుచుకున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా.. మాత్రం దాదాపు 22 సంవత్సరాలుగా సినీరంగాన్ని ఏలేస్తుంది. బాక్సాఫీస్ కింగ్ ఇదే అంటూ ఇప్పుడు మరోసారి తెరపైకి ఆ మూవీ పేరు వచ్చింది. ఆ సినిమా మరేదో కాదు.. చంద్రముఖి. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆ మూవీ రికార్డ్ సృష్టించింది. 890 రోజులు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడింది. 2005లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Trivikram Srinivas: అతడు కెమెరా కోసమే పుట్టాడు.. నాకు ఇష్టమైన హీరో.. త్రివిక్రమ్ ప్రశంసలు..

పి. వాసు దర్శకత్వం వహించిన చంద్రముఖి సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. మలయాళంలో మోహన్ లాల్, సురేష్ గోపి, శోభన వంటి తారలు నటించిన మణిచిత్రతాజు సినిమాకు రీమేక్ గా వచ్చిన మూవీ ఇది. ఇందులో నయనతార, జ్యోతిక, వడివేలు, నాజర్, ప్రభు, వినీత్, సోనూసూద్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో రజినీకాంత్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసిన సాంగ్.. భాష అర్థం కాకపోయినా కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది.. ఆ గ్లామర్ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

ఈ చిత్రానికి విద్యాసాగర్ అందించిన పాటలు సైతం సూపర్ హిట్ అయ్యాయి. 2005లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అప్పట్లో రూ. 100 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. అలాగే చెన్నైలోని శాంతి థియేటర్‌లో ఈ చిత్రం 890 రోజులు ప్రదర్శించబడింది.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu: అంత కష్టపడి సినిమా తీస్తే నిర్మాత మోసంతో ఎవరినీ నమ్మలేకపోతున్నా.. నటుడు రవిబాబు ..

ఎక్కువ మంది చదివినవి : Trivikram : ఆ పాట విని ఆశ్చర్యపోయా.. తెలుగు డిక్షనరీ కొని మరీ అర్థం వెతికాను.. త్రివిక్రమ్ శ్రీనివాస్..