
గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకుల విషయంలో భారీ మార్పు వచ్చింది. గతంలో కొన్ని సినిమాల విజయం లేదా వైఫల్యం బాక్సాఫీస్ వద్ద మాత్రమే నిర్ణయించబడేది, కానీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు చాలా ఫ్లాప్ చిత్రాలకు రెండవ జీవితాన్ని ఇస్తున్నాయి. అంటే.. అప్పట్లో థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయిన సినిమాలు.. ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. రోజు రోజుకీ అడియన్స్ సినిమాలు చూసే విధానం మారుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా దాదాపు 8 సంవత్సరాల క్రితం విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలై చివరకు అట్టర్ ప్లాప్ అయ్యింది. కానీ ఇప్పుడు అదే సినిమా ఓటీటీలో తెగ దూసుకుపోతుంది. ఆ మూవీ పేరు BA పాస్ 2.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..
2017లో విడుదలైన ఈ మూవీ పరాజయం పాలైంది. కానీ అది ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం 99 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 5 కోట్లు. ఈ సినిమాలో చాలా బోల్డ్ సన్నివేశాలు ఉన్నప్పటికీ, ఈ సినిమా పరాజయం పాలైంది. ఈ సినిమా IMDb రేటింగ్ 2.2. పొందింది. ఇందులో కృతికా సచ్‌దేవా, సతీష్ సారథి సషో, సంఘమిత్ర హితైషి , ఇంద్రానిల్ సేన్‌గుప్తా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కథ సున్నితమైనదే అయినప్పటికీ, విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుండి పెద్దగా స్పందన రాలేదు.
ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..
థియేటర్లలో భారీ డిజాస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ‘BA పాస్ 2’ ఇటీవల జియో హాట్‌స్టార్‌లో విడుదలైంది. ప్రస్తుతం చిత్రానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అలాగే ప్రస్తుతం టాప్ 10 ట్రెండింగ్ జాబితాలో 7వ స్థానంలో ఉంది.
ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..
ఎక్కువ మంది చదివినవి : Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..