Actress : ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ సార్.. కట్ చేస్తే.. స్టార్ హీరోలతోనే వరుస ఛాన్సులు..

సినిమా ప్రపంచంలో అందం, ప్రతిభ మాత్రమే కాదు.. కాసింత అదృష్టం కూడా ఉండాల్సిందే. హీరోయిన్లుగా ఎదగాలని ఎన్నో ఆశలతో అడుగుపెట్టినవారిలో కొందరు మాత్రమే సక్సెస్ అవుతుంటారు. కొందరు వరుస సినిమాల్లో నటించినప్పటికీ ఎలాంటి గుర్తింపు రాదు. కానీ కొందరు ఒక్క సినిమాతోనే సెన్సేషన్ అవుతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం ఆ జాబితాలోకి చెందినవారే.

Actress : ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ సార్.. కట్ చేస్తే.. స్టార్ హీరోలతోనే వరుస ఛాన్సులు..
Nikiha Dutta

Updated on: Nov 30, 2025 | 11:14 AM

సినీరంగంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. అందుకే సవాళ్లు ఎదురైన ఆత్మవిశ్వాసంతో ప్రయత్నాలు చేసింది. కట్ చేస్తే.. ఒక్క సినిమాతోనే రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది. ఇప్పుడు వరుసగా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ నికితా దత్తా. బుల్లితెర నుంచి ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇప్పుడు సినీరంగంలో క్రేజీ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ హీరోగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన కబీర్ సింగ్ చిత్రంలో నటించింది. తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్ ఇది. ఈ ఒక్క సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకుంది.

ఇవి కూడా చదవండి :  Hema Chandra: శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్.. హేమచంద్ర రియాక్షన్ ఇదే..

అప్పటివరకు సైడ్ ఆర్టిస్టుగా ఉన్న ఆమె.. కబీర్ సింగ్ తర్వాత స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. లేకర్ హమ్ దీవానా దిల్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ నటించిన గోల్డ్ మూవీలో కీలకపాత్ర పోషించింది. ఆ తర్వాత లస్ట్ స్టోరీస్ మూవీలో బోల్డ్ రోల్ పోషించింది. హిందీలో డ్రీమ్ గర్ల్, ఏక్ దుజే కే వాస్తే, హాసిల్ వంటి షోలతో గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆమె కెరీర్ మలుపు తిప్పిన సినిమా కబీర్ సింగ్.

ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ హిందీ లో బిజీగా ఉంటుంది నికితా దత్తా. ఇటీవలే సైఫ్ అలీఖాన్ సరసన జెవెల్ థీఫ్ అనే సినిమాతో అలరించింది. అలాగే ఘరత్ గణపతి చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డ్ అందుకుంది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటుంది నికితా దత్తా.

ఇవి కూడా చదవండి : Serial Actress : సినిమాల్లో హీరోయిన్ కావాలనుకుంది.. కట్ చేస్తే.. సీరియల్స్‏లో విలన్ అయ్యింది.. గ్లామర్ క్వీన్ రా బాబూ..

ఇవి కూడా చదవండి : Actress : 50 సినిమాల్లో హీరోయిన్.. ఒక్కరోజులోనే కెరీర్ క్లోజ్.. అసలేం జరిగిందంటే..