Tollywood: కశ్మీరీ అందంలో ఉన్న ఈ చిన్నారి ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఇప్పుడు రాజకీయాల్లో ఫేమస్..

|

Aug 27, 2024 | 8:45 AM

ఈ నటి 80,90sలో బిజీ హీరోయిన్.. అలాగే ఇప్పటికీ సినిమాల్లో చురుకుగా ఉంది. మెగాస్టార్ చిరంజీవితో ఎక్కువ సినిమాల్లో నటించింది. అలాగే తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం సినిమాల్లో అమ్మ పాత్రలలో మెప్పిస్తుంది. అలాగే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో చాలా పాపులర్ అవుతుంది. ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసా.. ?

Tollywood: కశ్మీరీ అందంలో ఉన్న ఈ చిన్నారి ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఇప్పుడు రాజకీయాల్లో ఫేమస్..
Senior Actress
Follow us on

ప్రస్తుతం సోషల్ మీడియాలో కాశ్మీరీ సంప్రదాయ దుస్తులు ధరించిన ఓ అమ్మాయి ఫోటోలు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం నటిగా కెరీర్ ప్రారంభించిన అమ్మాయి నేడు సౌత్ ఇండియా ఫేవరెట్ హీరోయిన్. ఈ నటి 80,90sలో బిజీ హీరోయిన్.. అలాగే ఇప్పటికీ సినిమాల్లో చురుకుగా ఉంది. మెగాస్టార్ చిరంజీవితో ఎక్కువ సినిమాల్లో నటించింది. అలాగే తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం సినిమాల్లో అమ్మ పాత్రలలో మెప్పిస్తుంది. అలాగే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో చాలా పాపులర్ అవుతుంది. ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసా.. ? తనే సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్. తమిళ సినీ నటుడు, హాస్యనటుడు MR రాధ కుమార్తె రాధిక. పైన కనిపిస్తున్న కశ్మీరీ అందం ఫోటో శ్రీలంక గీతా చిత్రంలోనిది. రాధిక తన విద్యను భారత్, శ్రీలంక, యుకెలో పూర్తి చేసింది.

1978 తమిళంలో డైరెక్టర్ భారతీరాజా తెరకెక్కించిన ఇష్కిష్కే పోమియా రైల్ మూవీతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. రాధిక తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో నటించింది. తెలుగులో ఎక్కువగా చిరంజీవి, కమల్ హాసన్, రజినీ వంటి స్టార్ హీరోలతో నటించింది. రాధిక, శరత్‌కుమార్‌లు ఫిబ్రవరి 4, 2001న వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు స్నేహితులుగా ఉన్న వీరు నమ్మ అన్నాచ్చి (1994), సూర్యవంశం (1997) అనే రెండు చిత్రాల్లో జంటగా నటించారు. వీరికి రాహుల్, ర్యానే హార్డీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. దర్శకురాలిగా, నిర్మాతగా కూడా రాణించింది.

ఇవి కూడా చదవండి

రాధిక . రాడాన్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపకుడు, చైర్‌పర్సన్. రాధిక ఒక జాతీయ అవార్డు, ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు, తమిళనాడు ప్రభుత్వ రాష్ట్ర చలనచిత్ర అవార్డును మూడు సార్లు గెలుచుకున్నారు. రాధిక కూడా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. 2006లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె భర్త ఆర్. శరత్‌కుమార్‌తో కలిసి ఏఐఏడీఎంకేలో చేరారు. అయితే అదే ఏడాది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆమెను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. ఆమె 2007 నుండి ఆల్ ఇండియా సమత్వ మక్కల్ కట్చి కార్యకర్తగా ఉన్నారు. ఇటీవలే బీజేపీ పార్టీలో చేరారు. ఈ ఏడాది ఎన్నికలలో రాధికకు బీజేపీ ఎంపీ టికెట్టు ప్రకటించగా.. రాధిక ఒడిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.