Nagarjuna : నాగార్జున, బాలకృష్ణతో బ్లాక్ బస్టర్ హిట్స్..కట్ చేస్తే.. 10 ఏళ్లకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. అప్పట్లో అందం, అభినయంతో కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఆమె.. హిందీలో వరుస సినిమాల్లో నటిస్తూ అక్కడే సెటిల్ అయ్యింది. ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా ?

Nagarjuna : నాగార్జున, బాలకృష్ణతో బ్లాక్ బస్టర్ హిట్స్..కట్ చేస్తే.. 10 ఏళ్లకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
Balakrishna, Nagarjuna

Updated on: Oct 29, 2025 | 10:22 PM

ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో అందం, నటనతో చక్రం తిప్పిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తెలుగులో మీనా, రమ్యకృష్ణ, సౌందర్య, రంభ, నగ్మా, సంఘవి వంటి స్టార్ హీరోయిన్స్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. అప్పట్లో తెలుగులోకి బాలీవుడ్ హీరోయిన్లను పరిచయం చేశారు నాగార్జున. కొత్త హీరోయిన్లకు తెలుగులో అవకాశాలు ఇచ్చారు. అయితే కొందరు ఇక్కడే సెటిల్ కాగా.. మరికొందరు తెలుగులో ఒకటి రెండు చిత్రాల్లో నటించి ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్.. ఒకప్పుడు నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్ చేసింది. ఆ తర్వా హిందీలో సెటిల్ అయ్యింది. ఇప్పుడు పదేళ్లకు తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? తనే హీరోయిన్ రవీనా టాండన్.

ఇవి కూడా చదవండి : Cinema : ఏం ట్విస్టులు రా బాబూ.. దెబ్బకు మైండ్ బ్లాక్.. సైకలాజికల్ హారర్ సినిమా.. ఒంటరిగా చూడలేరు..

ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. హిందీలో స్టార్ హీరోలతో అనేక చిత్రాల్లో నటించింది. నందమూరి బాలకృష్ణ సరసన బంగారు బుల్లోడు చిత్రంలో నటించింది. అలాగే అక్కినేని నాగార్జున జోడిగా ఆకాశీవీధిలో సినిమాలో కనిపించింది. ఈ రెండు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అందం, అభినయంతో జనాలను కట్టిపడేసింది. దీంతో తెలుగులో ఆమె మరిన్ని సినిమాల్లో నటిస్తుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. రెండు సినిమాల తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదు. 2014లో మోహన్ బాబు జోడిగా పాండవులు పాండవులు తుమ్మెద చిత్రంలో కనిపించింది. కొంతకాలం బ్రేక్ తీసుకున్న రవీనా.. యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రంలో నటించింది.

ఇవి కూడా చదవండి : Actress: ఒక్క సినిమా చేయలేదు.. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకం..

ఇక ఇప్పుడు పదేళ్లకు తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఆమె సూర్య 46 చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇప్పుడు తెలుగులో నేరుగా ఓ సినిమా చేయనున్నారు. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవీనా టాండన్ కీలకపాత్ర పోషిస్తున్నట్ల అధికారికంగా ప్రకటించారు. రవీనా పదేళ్లకు రీఎంట్రీ ఇవ్వడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుంది.

ఇవి కూడా చదవండి : Serial Actress: సూపర్ సూపరో.. సముద్రం మధ్యలో సీరియల్ బ్యూటీ గ్లామర్ ట్రీట్.. ఫోటోలతో కిక్కెంచిన అమూల్య..