
ప్రస్తుతం సినీరంగం చాలా మారిపోయింది. ఇప్పుడు హీరోహీరోయిన్స్ ప్రేమ, పెళ్లి బంధాలకు దూరంగా ఉంటున్నారు. లేటు వయసులో వివాహం చేసుకుని అటు సినిమాల్లోనూ కొనసాగుతున్నారు. కరీనా కపూర్, అలియా భట్, దీపికా పదుకొణె వంటి స్టార్స్ పెళ్లి, పిల్లలు అయిన తర్వాత కూడా బాక్సాఫీస్ ను ఏలేస్తున్నారు. కానీ ఒకప్పుడు పరిస్థితి భిన్నంగా ఉండేది. హీరోయిన్స్ పెళ్లి తర్వాత తమ కెరీర్ నిలబెట్టుకోవడం అంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నటి సైతం ఎన్నో కష్టాలు ఎదుర్కొని సినీరంగాన్ని ఏలేసింది. ఆమె కేవలం 15 సంవత్సరాల వయసులో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఇక అదే ఏడాది పెళ్లి చేసుకుంది. 17 వయసులోనే తల్లి అయ్యింది. ఆమె మరెవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ మౌషుమి ఛటర్జీ. 1952లో ఇందిరా ఛటర్జిగా జన్మించిన ఆమె 1967లో బెంగాలీ సినిమా బాలికా బధులో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది.
ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. తొలినాళ్లలో విజయం సాధించినప్పటికీ, మౌషుమి మొదట్లో తన చదువుపై దృష్టి పెట్టాలని కోరుకుంది. తన కుటుంబం కోరిక మేరకు ఆమె ప్రముఖ సంగీత స్వరకర్త, గాయకుడు హేమంత్ కుమార్ కుమారుడు జయంత్ ముఖర్జీని వివాహం చేసుకుంది. క్యాన్సర్ చివరి దశలో ఉన్న తన తండ్రి చివరి కోరిక మేరకే తాను పెళ్లి చేసుకున్నానని.. అందుకు చదువు సైతం వదిలేయాల్సి వచ్చిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది మౌషుమి. ఆమె రెండవ బెంగాలీ చిత్రం, పరిణీత (1969). 1972లో అనురాగ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. చిన్న వయసులోనే తల్లి అయ్యానని.. అప్పుడే తన విజయాలకు మెర్సిడెస్ కారు కొన్నట్లు తెలిపింది.
Moushumi Chatterjee
1970లలో, మౌషుమి ఛటర్జీ బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా ఎదిగారు. హిందీ, బెంగాలీలో వరుస సినిమాల్లో నటించింది. పెళ్లి, పిల్లలు అయిన తర్వాత సినీరంగంలో వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది మౌషుమి.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..