Actress: ఒకప్పుడు సీరియల్ హీరోయిన్.. ఇండస్ట్రీ వదిలేసి వ్యాపారరంగంలోకి.. ఇప్పుడు 1200 కోట్లకు యజమాని..

ఒకప్పుడు బుల్లితెరపై ఫేమస్ హీరోయిన్. ఎన్నో సీరియల్స్, టీవీ షోస్ చేసి జనాలకు దగ్గరయ్యింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఇండస్ట్రీకి దూరమైంది. ఇఫ్పుడు వ్యాపారరంగంలో సత్తా చాటుతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఇంతకీ ఈ నటి ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా.

Actress: ఒకప్పుడు సీరియల్ హీరోయిన్.. ఇండస్ట్రీ వదిలేసి వ్యాపారరంగంలోకి.. ఇప్పుడు 1200 కోట్లకు యజమాని..
Ashka

Updated on: Nov 11, 2025 | 10:31 PM

సినిమా హీరోయిన్లకే కాదు.. సీరియల్ తారలకు సైతం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సీరియల్స్ లో అనేక పాత్రలు పోషించి తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నవారు ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓహీరోయిన్.. ఒకప్పుడు స్మాల్ స్క్రీన్ పై క్రేజీ హీరోయిన్. కానీ ఇప్పుడు ఆమె రూ.1200 కోట్లకు యజమాని. ఆమె పేరు ఆష్కా కొరాడియా. 2002లో ‘ఆజనక్ 37 సాల్ బాత్’ అనే హిందీ సీరియల్ ద్వారా నటిగా అరంగేట్రం చేసింది. తరువాత, ‘బాబీ’ ‘తుమ్ బిన్ జావోన్ కహా’ వంటి సీరియల్స్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది.

తక్కువ సమయంలోనే టీవీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన పాత్రలు ఇప్పటికీ జనాల మదిలో నిలిచిపోయాయి. ఆమె హిందీ బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొంది. 2019లో, ఆమె చివరిగా ‘ధాయన్’ అనే హర్రర్ సిరీస్‌లో నటించింది. కెరీర్ ఫాంలో ఉండగానే సీరియల్స్ కు గుడ్ బై చెప్పేసింది. 20 సంవత్సరాలు టీవీల్లో సీరియల్స్ చేసిన ఆమె.. ఆ తర్వాత వ్యాపారరంగంలోకి అడుగుపెట్టింది. ఆమె అహ్మదాబాద్‌లో ‘రెనే కాస్మెటిక్స్’ అనే మేకప్ బ్రాండ్‌ను ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?

ఆష్కా గొరాడియా 2018లో రూ. 50 లక్షల పెట్టుబడితో ఈ బ్రాండ్‌ను సృష్టించింది. తన బ్రాండ్‌ను స్టోర్‌లలో మాత్రమే కాకుండా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, నైకా, మైంట్రాలలో డిజిటల్‌గా కూడా అమ్మడం ప్రారంభించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో తన బ్రాండ్ బ్రాంచీలను స్టార్ట్ చేసింది. ఈ మేకప్ బ్రాండ్ ప్రారంభించిన మొదటి 2 సంవత్సరాల్లో రూ. 100 కోట్ల ఆదాయాన్ని రాబట్టింది.

ఈ బ్రాండ్ 2024 నాటికి రూ. 1,200 కోట్ల నుండి రూ. 1,400 కోట్ల ఆదాయాన్ని రాబట్టిందని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. దీని గురించి ఆష్కా గొరాడియా మాట్లాడుతూ, “నేను 16 సంవత్సరాల వయసులో ముంబైకి వచ్చాను. 23 సంవత్సరాల వయసులో ముంబైలో నా సొంత ఇల్లు కొన్నాను. నేను ఎల్లప్పుడూ పెద్ద కలలను కనడం స్టార్ట్ చేసి విజయం సాధించానని” అన్నారు.

ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..

ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?