
టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీరంగ ప్రవేశం చేసిన పవన్.. సుస్వాగతం, తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాడు. తన నటనతో పవర్ స్టార్ గా అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. ప్రతి సినిమాను ఎంచుకోవడానికి.. కంటెంట్ ప్రాధాన్యతను తెలుసుకుంటూ ఎంతో జాగ్రత్తగా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ హీరో అనిపించుకున్నారు. అందుకే ఆయన వ్యక్తిత్వానికి అభిమాని కానివారుండరు. రాజకీయాల కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవన్.. ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే రెండు మూడు నెలలుగా ఈ మూవీస్ షూటింగ్ కు బ్రేక్ పడింది. అందుకు కారణం పవన్ మళ్లీ రాజకీయాల్లో బిజీ కావడమే. ప్రస్తుతం రాజకీయ ప్రచారాల్లో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు పవన్.
ఇదిలా ఉంటే.. సినీ పరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాలు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన పవన్.. ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క యాడ్ చేశారని తెలుసా ?. తొలి నాళ్లలో ఆయన చేసిన ఫస్ట్ యాడ్ పెప్సీ. 2001లోనే ఇండియాలో మోస్ట్ పాపులర్ బ్రాండ్ పెప్సీ కూల్ డ్రింగ్ సంస్థకు పవన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. సౌత్ ఇండియాలో ఓ స్టార్ హీరో ప్రొడక్ట్స్ యాడ్ ఇవ్వడం అదే తొలిసారి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి థమ్స్ అప్ యాడ్ చేశారు. ఇప్పటికీ పవన్ చేసిన పెప్సీ యాడ్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంటుంది.
Pawan Kalyan
అయితే అప్పట్లో పెప్సీ యాడ్ చేసినందుకు ఆయనకు ఎక్కువే రెమ్యునరేషన్ ఇచ్చారట. ఈ యాడ్ చేసినందుకు పవన్ కు పెప్సీ సంస్థ రూ. 70 నుంచి రూ. 100 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తుంది. అప్పట్లోనే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరో పవన్ కావడం విశేషం. దాదాపు 20 ఏళ్ల కిందటే రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని రికార్డ్ సృష్టించారు. ఇదిలా ఉంటే.. పవన్ చివరిసారిగా కనిపించిన సినిమా బ్రో. ఇందులో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించరు. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.