
తమిళ చిత్ర పరిశ్రమలో యోగి బాబుకు మంచి డిమాండ్ ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్‌గా నటిస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు యోగిబాబు. ‘మెర్సల్’, ‘డాక్టర్’, ‘వారిసు’, ‘ జైలర్ ’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు ఈ స్టార్ కమెడియన్ . ఇది కాకుండా, ‘మండేలా’ వంటి సినిమాలలో కూడా ఆయన నటించి మెప్పించాడు. ఆయన తెరపైకి కనిపిస్తే చాలు ప్రేక్షకులు తెగ నవ్వుకుంటారు. యోగిబాబు సినిమాల్లోకి వచ్చి ఎంతో కాలం కావడంలేదు. ఈ మధ్యకాలంలోనే ఆయన ఫెమస్ అయ్యారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో యోగిబాబు రెమ్యునరేషన్ గురించి టాక్ వినిపిస్తుంది. ఒకప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న యోగిబాబు ఇప్పుడు స్టార్ గా మారిపోయారు. యోగి బాబు ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? తెలిస్తే నిజంగా షాక్ అయిపోతారు.
సాధారణంగా ఒక సినిమాకు హీరో, హీరోయిన్లకు రెమ్యూనరేషన్ ఫిక్స్ చేస్తారు. కానీ, సహాయ నటులు, హాస్యనటుల విషయంలో అలా కాదు. వారికి రోజువారీగా చెల్లిస్తారు. ఈ క్రమంలోనే నటుడు యోగి బాబు రోజుకు 12 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది. గతంలో రోజుకు రూ.10 లక్షలు అందుకునే యోగిబాబు ఇప్పుడు 12 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది.
అంతకుముందు ఈ విషయంపై యోగి మీడియాకు క్లారిటీ ఇచ్చారు. ’10-15 లక్షలు ఇవ్వాలని నేను ఎవరినీ అడగలేదు. నాకు మొదట్లో రూ.2000 మాత్రమే ఇచ్చారు. నాకు బాగా తెలుసు నిర్మాతలు ఎంత కష్టపడతారో.. మీరు అనుకునేంత రెమ్యునరేషన్ నాకు రాదు అని గతంలో యోగిబాబు అన్నారు. యోగి బాబు ఇప్పుడు తమిళ్ లో ఫుల్ బిజీ. ఆయనచేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ‘హర’, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’, ‘నాన్ వయొలెన్స్’, ‘కంగువ’ చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే తమిళ స్టార్స్ అందరితోనూ నటించాడు. దళపతి విజయ్, యోగిబాబుల కెమిస్ట్రీ బాగా కుదిరింది. అయితే పాపులారిటీతో పాటు పలు విమర్శలను కూడా యోగి బాబు ఎదుర్కొన్నారు. అతని లుక్ చూసి చాలా మంది నువ్వు.. నీ అవతారం అంటూ.. బాడీ షేమింగ్ చేశారు. అయితే దీని గురించి పెద్దగా ఆలోచించలేదు. కామెడీకి బాడీ లాంగ్వేజ్ చాలా ముఖ్యం. నేను దాన్ని వాడుకున్నాను అని యోగి బాబు గతంలో అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.