
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ అఖండ 2. డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 12న అడియన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన అఖండ 2 ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేస్తుంది. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటించగా.. మరో అమ్మాయి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఆమె పేరు హర్షాలీ మల్హోత్రా. బాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయిజాన్ సినిమాలో మున్నీ పాత్రలో పాపులర్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..
ఇప్పుడు అఖండ 2 చిత్రంలో బాలయ్య కూతురిగా కనిపించి తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె పాత్రనే ప్రదానం. సినిమా కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. తొలి సినిమాతోనే తెలుగులో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది హర్షాలీ. నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా టాలీవుడ్ స్టార్ హీరో కూతురిని అనుకున్నారట. కానీ అనుహ్యంగా ఆ ఛాయిస్ హర్షాలీకి దక్కింది. ఇంతకీ అఖండ 2 సినిమాను మిస్సైన ఆ స్టార్ హీరో కూతురు ఎవరో తెలుసా.. ? తనే సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని.
ఇవి కూడా చదవండి : Actress : కమిట్‌మెంట్ ఇవ్వలేదని 30 సినిమాల్లో నుంచి తీసేశారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..
ఈ సినిమాలో హర్షాలీ పాత్రకు ముందుగా సితారను అనుకున్నారట. కానీ ఏం జరిగిందో తెలియదు ఆ తర్వాత ఈ చిత్రంలో ఛాన్స్ హర్షాలీకి వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య కూతురు జనని పాత్రలో హర్షాలీ తన అద్భుత నటనతో ఆకట్టుకుంది. ఒకవేళ ఇందులో సీతార నటించి ఉంటే మరింత క్రేజ్ వచ్చేందని అభిప్రాయపడుతున్నారు ఫ్యాన్స్.
ఇవి కూడా చదవండి : 11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తెలుగులో తోపు హీరోయిన్..సైన్యంలో పనిచేసి ఉరి దాడిలో మరణించిన తండ్రి..