ఇండస్ట్రీలో ఒక హీరో వద్దనుకున్నా సినిమాలు మరో హీరో చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. డేట్స్ ఖాళీ లేకనో లేక కథ నచ్చకో సినిమాలు వదులుకొని ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయినప్పుడు బాధపడిన హీరోలు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ సినిమా కథను రిజక్ట్ చేశారట. కానీ అదే కథతో నటసింహం బాలకృష్ణ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారట. మెగాస్టార్, బాలయ్య ఇద్దరు సూపర్ స్టార్స్. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన సీనియర్ హీరోలు. ఈ ఇద్దరూ తమ కెరీర్ లో చేయని పాత్ర లేదు అనే చెప్పులి. ఇప్పటికి కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి, బాలకృష్ణ. అయితే మెగాస్టార్ మిస్ చేసుకున్న సినిమా ను బాలయ్య చేసి హిట్ కొట్టారట.. ఆ సినిమా ఏదంటే..
ఒకప్పుడు సీనియర్ హీరోలకు భారీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బీ గోపాల్. ఈ దర్శకుడు ఓ పవర్ ఫుల్ పోలీస్ కథతో మెగాస్టార్ దగ్గరకు వెళ్ళాడట. కథను కూడా వివరించాడట.. కానీ చిరు ఆ సినిమాను రిజక్ట్ చేశారట. ఆ సినిమానే రౌడీ ఇన్స్పెక్టర్. విజయ్ శాంతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలకృష్ణ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది.
ఈ కథ చెప్పే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారట. దాంతో డేట్స్ అడ్జెస్ట్ కాకా ఆ సినిమా కథను సున్నితంగా తిరస్కరించారట. అయితే బీ గోపాల్ అదే కథను బాలకృష్ణ కు చెప్పి ఒప్పించారట. ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచి ఏకంగా 100రోజులు ఆడింది. ఆ తర్వాత బి గోపాల్ మెగాస్టార్ తో ఇంద్ర సినిమా చేసి మరో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇక ఇప్పుడు చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు. అటు బాలయ్య బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.
నా అభిమానాన్ని అందుకున్న మొట్టమొదటి చిట్టచివరి హీరో నువ్వే ఒక నటుడిగా ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేయలేరు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నీ అభిమానిగానే పెరిగా మీ అభిమానిగానే ఉంటా.. జై బాలయ్య..! జై జై బాలయ్య..!#NandamuriBalakrishna #BlockbusterBhagavanthKesari #BhagavanthKesari pic.twitter.com/8wfbqs20Jg
— Nandamuri Balakrishna (@NBK_Unofficial) October 20, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.