
హాలీవుడ్ సినిమాలకు మనదేశంలోనూ భారీగా అభిమానులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది ఈ ఇంగ్లిష్ సినిమాలను ఎగబడి చూస్తారు. అలా యాక్షన్ జానర్ కు సంబంధించి హాలీవుడ్ ఫ్రాంఛైజీల్లో సూపర్ హిట్ అయిన సిరీస్ చాలా ఉన్నాయి. అలాగే సూపర్ హీరోల సినిమాలకు మన దగ్గర విపరీతంగా క్రేజ్ ఉంది. మార్వెల్ సినిమాలు మన దగ్గర అన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ఇండియాలోనూ ఈ సిరీస్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక హాలీవుడ్ సినిమాలు తెలుగులో కూడా మార్కెట్ చేసుకోవడానికి చాలా మంది మన తెలుగు హీరోల వాయిస్ ఓవర్లతో రిలీజ్ చేస్తున్నారు. అవైజర్స్ ఎండ్ గేమ్ లో థానోస్ పాత్రకు రానా వాయిస్ ఇచ్చారు. అదిరిపోయే తన వాయిస్ తో సినిమాకు హైలైట్ గా నిలిచారు రానా..
ఆతర్వాత సూపర్ మహేష్ బాబు కూడా హాలీవుడ్ సినిమాకు వాయిస్ ఇచ్చారు. లయన్ కింగ్ సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన ముఫాసా సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఇచ్చారు. అలాగే సత్యదేవ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రకు వాయిస్ ఇచ్చారు. అయితే దగ్గుబాటి స్టార్ హీరో వెంకటేష్ కూడా ఓ హాలీవుడ్ సినిమాకు వాయిస్ ఇచ్చారు. ఆ సినిమా ఎదో మీకు తెలుసా.? అవును వెంకటేష్ ఓ హాలీవుడ్ మూవీకి తన వాయిస్ ఇచ్చారు.
ఆ సినిమా ఎదో కాదు హాలీవుడ్ లో తెరకెక్కిన అల్లాదీన్. ఈ సినిమా 2019లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో హాలీవుడ్ హీరో విల్ స్మిత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. అల్లాదీన్ సినిమాలో విల్ స్మిత్ జీనీ పాత్రలో కనిపించాడు. ఈ సినిమాకు విల్ స్మిత్ పాత్రకు వెంకటేష్ వాయిస్ ఇచ్చారు. అలాగే అల్లాదీన్ పాత్రకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వాయిస్ ఇచ్చాడు. ఈ సినిమాలో వెంకీ వాయిస్‌తో మ్యాజిక్ చేశాడు. ఇక ఈ సినిమా తెలుగులో రూ.55 కోట్లు వసూల్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 9వేల కోట్లుకు పైగా వసూల్ చేసింది.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి