మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి తెలిసిందే. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆత్మవిశ్వాసం, స్వయంకృషితో ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవిగా తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. దశాబ్దాలుగా సినీపరిశ్రమలో అద్భుతమైన రికార్డ్స్ సృష్టించి కోట్లాది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు, సహజమైన నటన, డ్యాన్స్ తో అప్పట్లో ఊర్రూతలూగించిన చిరు.. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక కొన్ని సంవత్సరాల క్రితం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన చిరు ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా కుర్రహీరోలకు సైతం గట్టి పోటీనిస్తున్నారు. తెలుగు చిత్రపరిశ్రమలో లెజెండరీ హీరోగా ఎదిగిన చిరు దాదాపు 30 ఏళ్లుగా చిత్రపరిశ్రమలో విజయవంతంగా కొనసాగుతున్నారు. 150కి పైగా చిత్రాల్లో నటించాడు. తన కెరీర్‌లో 24,000 డ్యాన్స్ స్టెప్పులు వేసి గిన్నిస్ రికార్డు సాధించాడు. అయితే ఈ క్రమంలోనే తాజాగా బెంగుళూరులో చిరుకు ఉన్న ఫామ్ హౌస్ గురించి ఇప్పుడు నెట్టింట ఓ క్రేజీ న్యూస్ వైరలవుతుంది.
బెంగళూరుకు 35 కి.మీ దూరంలో చిరంజీవికి ఓ ఫామ్ హౌస్ ఉంది. ఈ ఫామ్ హౌస్ ధర రూ.30 కోట్లు ఉంటుందని సమాచారం. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఈ ఫామ్ హౌస్ ఉంది. కొన్నేళ్ల క్రితమే చిరు ఈ హౌస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పండగలు, ఫ్యామిలీ ఈవెంట్స్ కోసం అప్పుడప్పుడు తన కుటుంబంతో కలిసి చిరు ఇక్కడకు వస్తాడు. ఈ ఏడాది సంక్రాంతి పండగను ఇదే ఫామ్ హౌస్ లో సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే చిరుకు హైదరాబాద్ లోనూ విలాసవంతమైన బంగ్లా ఉంది. దాదాపు రూ.30 కోట్లతో ఆ ఇంటిని నిర్మించారు. మార్కెట్ ధర ప్రకారం ఆ ఇల్లు ధర రూ.300 కోట్లు.
చిరు వద్ద ఉన్న కార్స్ కలెక్షన్స్ ఇదే. రోల్స్ రాయిస్ పంథమ్ (రూ. 10 కోట్లు), టయోటా ల్యాండ్ క్రూయిజర్ 3వ తరం (రూ. 90 లక్షలు), టయోటా ల్యాండ్ క్రూయిజర్ 4వ జెన్ (రూ. 1.50 కోట్లు), రేంజ్ రోవర్ వోగ్ (రూ. 1 కోటి), రే రోవర్ ఆటో ఫైవ్ (రూ. 275 కోట్లు) iota Wall Fire (రూ. 1 కోటి) కార్లు ఉన్నాయి. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.