Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి తెలిసిందే. దశాబ్దాలుగా సినీప్రియాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు వారణాసి సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..
Mahesh Babu

Updated on: Jan 24, 2026 | 10:30 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన నటించిన చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. చివరగా గుంటూరు కారం సినిమాతో హిట్టు అందుకున్న మహేష్.. ఇప్పుడు వారణాసి సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ ఎస్ఎస్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా.. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాపై మంచి హైప్ ఉండగా.. ఇప్పుడు మహేష్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదెంటంటే.. ఓ సూపర్ హిట్ సినిమాకు పనిచేసిన మహేష్.. అసలు రెమ్యునరేషన్ తీసుకోలేదట.

ఎక్కువ మంది చదివినవి : Trivikram Srinivas: అతడు కెమెరా కోసమే పుట్టాడు.. నాకు ఇష్టమైన హీరో.. త్రివిక్రమ్ ప్రశంసలు..

అవును.. సాధారణంగా ఏ హీరో అయినా సినిమా కోసం రెమ్యునరేషన్ తీసుకుంటారు. అలాగే అతిథి పాత్రలో కనిపించాలంటే సైతం పారితోషికం తీసుకుంటారు. కానీ మహేష్ మాత్రం ఓ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండానే వర్క్ చేశాడట. ఆ సినిమా మరేదో కాదు.. జల్సా. పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో త్రివిక్రమ్ రాసిన ప్రతి డైలాగ్ వేరేలెవల్. ఈ చిత్రానికి మహేష్ వాయిస్ ఓవర్ అందించారు. అందుకు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట.

ఎక్కువ మంది చదివినవి : అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసిన సాంగ్.. భాష అర్థం కాకపోయినా కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది.. ఆ గ్లామర్ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

జల్సా సినిమాకు మహేష్ ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. అలాగే ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ పాత్ర గురించి మహేష్ మాటల్లో విన్న ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేవు. ప్రస్తుతం మహేష్, పవన్ ఇద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu: అంత కష్టపడి సినిమా తీస్తే నిర్మాత మోసంతో ఎవరినీ నమ్మలేకపోతున్నా.. నటుడు రవిబాబు ..

 

ఎక్కువ మంది చదివినవి : Trivikram : ఆ పాట విని ఆశ్చర్యపోయా.. తెలుగు డిక్షనరీ కొని మరీ అర్థం వెతికాను.. త్రివిక్రమ్ శ్రీనివాస్..