Nostalgia: 2008లో వచ్చిన సంచలన పాట ‘అనితా.. ఓ వనితా’ రాసింది, పాడింది ఎవరో తెల్సా..?

అనిత ఓ అనిత సాంగ్ ఓ మాస్టర్ పీస్. 2008లో వచ్చిన ఈ పాట సంచలనంగా మారింది. అందులోని లిరిక్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి.

Nostalgia: 2008లో వచ్చిన సంచలన పాట 'అనితా.. ఓ వనితా' రాసింది, పాడింది ఎవరో తెల్సా..?
Anitha O Anitha Song
Follow us

|

Updated on: Jan 18, 2023 | 3:12 PM

అనితా… అనితా … అనితా … ఓ.. వనిత అంటూ వచ్చిన ఓ ప్రైవేట్ పాట 2008లో ఓ ఊపు ఊపేసింది. లవ్ ఫెయిల్యూర్ నేపథ్యంలో ఈ పాట జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. నైన్టీస్ కిడ్స్ కొంతమంది.. ఈ పాట విని విని.. ఒక్క లిరిక్ తప్పు లేకుండా పాడేవాళ్లు కూడా ఉన్నారు. ఇంకా 100 సంవత్సరాలు అయినా ఈ పాట చెక్కుచెదరదు. అందరికీ అర్థమయ్యే లిరిక్స్.. అందరి హృదయాలను తాకే పదాలు ఈ పాటలో మిళితం అయి ఉంటాయి. స్వచ్చమైన తన ప్రేమ గురించి చెబుతూ.. ప్రేయసి దూరమైతే ఆ బాధను భరించలేనంటూ.. ప్రియుడి వేదనను అద్భుతంగా ఆవిష్కరించాడు ఆ రచయిత. డబ్బా సెల్‌లో ఈ పాట పెట్టుకుని ఓ రేంజ్ లో ఫీల్ అయ్యే వాళ్లు అప్పట్లో. లవర్ లేకపోయినా ఉన్నట్లు తెగ ఫీల్ అయిపోయేవాళ్లు. ఆటోల్లోని స్పీకర్లలో ఈ పాట మారుమోగిపోయేది.

అయితే పాట విన్న ప్రతివాళ్లు ఈ సాంగ్ పాడింది ఎవరు.. రాసింది ఎవరు అని మాత్రం పక్కాగా సెర్చ్ చేస్తారు. అయితే ఈ పాట రాసింది, పాడింది ఒక్కరే. అవును.. అతడి పేరు గుణిపార్తి నాగరాజు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండంలోని గూనిపర్తి గ్రామం అతడి స్వస్థలం. అనిత పాట రైటర్‌గా, సింగర్‌గా అతడి ఫస్ట్ సాంగ్. ఈ పాట అనంతరం ఆయన చాలా పాటలు రాశాడు కానీ.. అనిత పాట అంత క్లిక్ అవ్వలేదు. ప్రస్తుతం ఈయన పాటల రాస్తూనే ఉన్నాడు. ఇతడి ఇంట్లో అందరూ సింగర్సే. మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్.. ఇలా ఇంట్లో అందరూ పల్లె పాటలు పాడతారు. ప్రజంట్ అతనికి మ్యారేజ్ అయి.. ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇక అనిత పాట రాయడం వెనుక కారణం తన లవ్ ఫెయిల్యూర్ అని చెప్పుకొచ్చాడు నాగరాజు. డిగ్రీ చదువుతున్నప్పుడు తాను, ఓ అమ్మాయి ప్రేమించుకున్నామని.. మధ్యలో ఆమె వదిలేయడంతో బాధతో అనిత పాట రాసుకొచ్చినట్లు తెలిపాడు. కాగా ఇతడి లవ్ స్టోరీని బేస్ చేసుకుని.. ప్రముఖ నటుడు చరణ్ రాజ్.. అనిత, నాగరాజు యదార్థ ప్రేమకథ అనే సినిమా కూడా తెరకెక్కించాడు.

Lyricist And Singer Gunipar

ANITHA O ANITHA SONG SINGER & WRITER NAGARAJ

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.