AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు ఎత్తుకుని పెంచిన కుర్రాడు.. ఇప్పుడు తెలుగులో పెద్ద డైరెక్టర్.. ప్రభాస్, ఎన్టీఆర్‏లతో బ్లాక్ బస్టర్స్.. పోసాని..

తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు పోసాని కృష్ణ మురళి. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. పోసాని కృష్ణ మురళి మేనల్లుడు సినీరంగంలో తోపు డైరెక్టర్ అని మీకు తెలుసా.. ? ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబులతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ తెరకెక్కించారు. ఇంతకీ ఆయన ఎవరంటే..

అప్పుడు ఎత్తుకుని పెంచిన కుర్రాడు.. ఇప్పుడు తెలుగులో పెద్ద డైరెక్టర్.. ప్రభాస్, ఎన్టీఆర్‏లతో బ్లాక్ బస్టర్స్.. పోసాని..
Posani Krishna Murali
Rajitha Chanti
|

Updated on: Jul 04, 2026 | 12:07 PM

Share

పోసాని కృష్ణమురళి.. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేశారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. కానీ మీకు తెలుసా.. ఆయన మేనల్లుడు తెలుగులో పెద్ద డైరెక్టర్. ఇప్పటివరకు స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ఆయన మరెవరో కాదు.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ.. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో పోసాని కృష్ణమురళి, కొరటాల శివ వెల్లడించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మేనల్లుడి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు పోసాని. “కొరటాల శివ స్వయానా నా మేనల్లుడే.. నాతోపాటు ఉండేవాడు.నా పెళ్లి చూపులకు కూడా తనను మాత్రమే తీసుకెళ్లాను. ఎలా ఉందిరా అమ్మాయి అని అడిగితే సూపర్ మామయ్య అన్నాడు. వెంటనే పెళ్లి చేసుకున్నాను. మేమిద్దరం ఏంతో సంతోషంగా ఉంటాము ” అని చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..

దర్శకుడు కొరటాల శివతో తన బంధుత్వం సొంత రిలేషన్ అని తెలిపారు. కొరటాల శివ తన అమ్మ సొంత తమ్ముడి కొడుకు అని, అంటే తన మేనత్త కొడుకు అవుతారని వివరించారు. తన అమ్మగారికి శివ మావయ్య అవుతారని కూడా అన్నారు. శివ తన ఆసక్తితోనే సినిమా పరిశ్రమలోకి వచ్చారని, తన ప్రభావంతో కాదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. కొరటాల శివ.. ఇండస్ట్రీలో ఫేమస్ డైరెక్టర్. ప్రభాస్ తో మిర్చి వంటి బ్లా్క్ బస్టర్ హిట్ అందుకున్నారు. అలాగే జనతా గ్యారేజ్, దేవర వంటి చిత్రాలను రూపొందించారు. ప్రస్తుతం బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..

పోసాని కృష్ణమురళి విషయానికి వస్తే.. తెలుగులో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దాదాపు 100కు పైగా సినిమాలకు, కథలు, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. వెండితెరపై విలక్షణ నటనతో, డైలాగ్ డెలివరీతో మెప్పించారు. ముఖ్యంగా రాజా అనే మేనరిజంతో ఇండస్ట్రీలోనే ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..

పోసాని కృష్ణమురళి మేనల్లుడు..

Posani, Koratala Shiva

Posani, Koratala Shiva

ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..

Follow Us