Bigg Boss Telugu 7: మోనిత మామూల్ది కాదుగా..! రెమ్యునరేషన్ భారీగానే వసూల్ చేసింది

|

Dec 11, 2023 | 11:58 AM

ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్ లో శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యింది. 14 వారాలు హోస్ లో ఉన్న శోభా శెట్టి తనదైన ఆట తీరుతో ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకుంటూ వచ్చి 14వారంలో ఎలిమినేట్ అయ్యింది. నిజానికి శోభా శెట్టి ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సింది. కానీ బిగ్ బాస్ ఆమెను సేవ్ చేసుకుంటూ వస్తున్నారని ప్రేక్షకులనుంచి విమర్శలు వచ్చాయి.

Bigg Boss Telugu 7: మోనిత మామూల్ది కాదుగా..! రెమ్యునరేషన్ భారీగానే వసూల్ చేసింది
Shobha Shetty
Follow us on

బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన వారి రెమ్యునరేషన్ గురించి ఎప్పుడు వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. బిగ్ బాస్ సీజన్ 7 మరి కొన్ని రోజుల్లో ముగిసిపోనుంది. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్ లో శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యింది. 14 వారాలు హోస్ లో ఉన్న శోభా శెట్టి తనదైన ఆట తీరుతో ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకుంటూ వచ్చి 14వారంలో ఎలిమినేట్ అయ్యింది. నిజానికి శోభా శెట్టి ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సింది. కానీ బిగ్ బాస్ ఆమెను సేవ్ చేసుకుంటూ వస్తున్నారని ప్రేక్షకులనుంచి విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యింది.

ఈవారం ఆమె ఎలిమినేట్ అవుతుందని ముందునుంచి అనుకుంటూనే ఉన్నారు. ఇక శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైకి రాగానే కన్నీళ్లు పెట్టుకుంది. నిన్నటి ఎపిసోడ్ లో ఫైనలిస్ట్ లను కన్ఫార్మ్ చేశారు నాగార్జున అర్జున్, ప్రియాంక, అమర్, ప్రశాంత్, యావర్ ను ఫైనలిస్ట్ లు గా అనౌన్స్ చేశారు నాగార్జున. చివరిగా శోభా శెట్టి, శివాజీని పిలిచి కాస్త టెన్షన్ పెట్టారు. చివరకు శోభా శెట్టి ఎలిమినేటెడ్ అని అనౌన్స్ చేశారు.

దాంతో శోభా శెట్టి షాక్ అయ్యింది. శివాజీకి అల్ ది బెస్ట్ చెప్పి బయటకు వచ్చేసింది శోభా.. బయటకు వచ్చాకా అందరితో మాట్లాడింది. చివరకు శివాజీ కాళ్లకు నమస్కరించి క్షమాపణ చెప్పింది. ఏదైనా తెలియక తప్పు చేసి ఉంటే క్షమించండి అని అడిగింది శోభా.. ఇక ఈ అమ్మడు 14 వారాలకు భారీగానే అందుకుంది తెలుస్తోంది. వారానికి 2.5 లక్షల రెమ్యునరేషన్ అందుకుంది శోభా శెట్టి. అంటే 14 వారాలకుగాను..శోభా శెట్టి 25 లక్షలు అందుకుందని తెలుస్తోంది.

శోభా శెట్టి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..