Sankranthiki Vasthunam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ బుల్లిరాజు బ్యాక్ గ్రౌండ్ తెలుసా? ఈ బుడ్డోడు మామూలోడు కాదండోయ్

|

Jan 15, 2025 | 11:50 AM

విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కంచిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు బ్యాక్ గ్రౌండ్ తెలుసా? ఈ బుడ్డోడు మామూలోడు కాదండోయ్
Sankranthiki Vasthunam movie
Follow us on

సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేశ్ సంక్రాతికి వస్తున్నాం సినిమాలకు మంచి స్పందన వస్తోంది. అయితే గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలు కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్స్.. కానీ వెంకీ సంక్రాంతికి వస్తున్నాం మాత్రం టోటల్లీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అందుకే మంగళవారం (జనవరి 14)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ వచ్చింది. మూవీ చూసిన వారందరూ తెగ నవ్వుకుంటున్నామంటున్నారు. వెంకీ, ఐశ్వర్య, మీనాక్షిల నటన అద్దిరిపోయిందంటూ కాంప్లిమెంట్స్ వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఈ సినిమాకు సంబంధించి మరొకరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అతనే బుల్లిరాజు పాత్రలో మెరిసిన ఛైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మరీ ముఖ్యంగా ఫస్టాప్ కు అద్దిరిపోయే రెస్పాన్స్ రావడానికి కారణం బుల్లిరాజు పాత్రలేనని సినిమా చూసిన వారందరూ చెబుతున్నారు. స్క్రీన్ పై ఈ బుడ్డోడు కనిపించినప్పుడల్లా థియేటర్లలోని ఆడియన్స్ మొహాలు నవ్వులతో వెలిగిపోతున్నాయి. ముఖ్యంగా గోదారి యాసలో ఈ పిల్లాడు చెప్పే డైలాగులకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ లో భాగమైన ఈ బుడ్డోడి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి.

 

ఇవి కూడా చదవండి

ఈ బుడ్డోడి అసలు పేరు భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్. మనిషి చూడ్డానికి బుడ్డోడే అయినా పేరు చూశారా ఎంత పెద్దగా ఉందో. ఈ పిల్లాడికి నటన అంటే చాలా ఇష్టమట. అందుకు కుటుంబ సభ్యుల సపోర్టు కూడా ఉందని సమాచారం. బుల్లిరాజు పాత్రకు రాసిన డైలాగ్స్ ను రేవంత్ అద్భుతంగా చెప్పడంతో అనిల్ రావిపూడి ఈ సినిమాకు రేవంత్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. అన్నట్లు రేవంత్ మంచి నటుడే కాక మంచి మాటకారి కూడా. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ బుడ్డోడు చేసిన సందడి అంతా ఇంతా కాదు.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ చేసే ఛైల్డ్ ఆర్టిస్టులు లేవరు. రేవంత్ ఆ లోటును భర్తీ చేస్తాడేమో చూడాలి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ కావడంతో ఇతర సినిమాల్లోనూ మరీ ముఖ్యంగా అనిల్ రావిపూడి భవిష్యత్తు ప్రాజెక్ట్స్ లో సైతం రేవంత్ కు ఆఫర్స్ రావచ్చునని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మొదటి రోజే భారీ కలెక్షన్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.