AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sangeetha: హీరోయిన్ సంగీత భర్త ఎవరో తెలుసా.. ? తెలుగులో పెద్ద సింగర్.. ఎన్ని సూపర్ హిట్స్ పాడారంటే..

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సంగీత సుపరిచితమే. ప్రకాష్ రాజ్, రవితేజ, శ్రీకాంత్ కలిసి నటించిన ఖడ్గం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషలలోనూ అనేక చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ సహాయ నటిగా ప్రేక్షకులను అలరిస్తుంది. ఇంతకీ మీకు సంగీత పర్సనల్ లైఫ్ గురించి మీకు తెలుసా.. ?

Sangeetha: హీరోయిన్ సంగీత భర్త ఎవరో తెలుసా.. ? తెలుగులో పెద్ద సింగర్.. ఎన్ని సూపర్ హిట్స్ పాడారంటే..
Sangeetha
Rajitha Chanti
|

Updated on: Aug 03, 2026 | 7:41 AM

Share

ఖడ్గం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది హీరోయిన్ సంగీత. ఈ చిత్రంలో అమాయకమైన అమ్మాయిగా ఒక్క ఛాన్స్ అంటూ తెలుగు ప్రేక్షకుల హృదయాలు దొచుకుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషలలోనూ అనేక చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆమె.. వరుస సినిమాలతో సహయ నటిగా అలరిస్తుంది. ఇదెలా ఉంటే.. సంగీత పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ అంతగా తెలియదు. కానీ మీకు తెలుసా ఆమె భర్త తోపు సింగర్. ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అతడు. సంగీత భర్త పేరు క్రిష్. చిత్ర పరిశ్రమలో అతడు పాపులర్ సింగర్. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. సినీ రంగంలో ఎప్పుడూ కలుసుకోని, కలిసి పనిచేయని క్రిష్‌తో తన వివాహం ఎలా జరిగిందో సంగీత గతంలో ఓ ఇంటర్వ్యూలో వివరించారు. సంగీత దర్శకుడు హ్యారిస్ జయరాజ్ సంగీతంలో వచ్చిన ‘ఉన్నాలే ఉన్నాలే’ చిత్రంలోని “జూన్ పోనా” పాటతో క్రిష్‌కి మంచి గుర్తింపు లభించింది. ఈ పాట సౌత్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. అంతేకాదు క్రిష్ మంచి నటుడు సైతం. పలు చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు.

గతంలో సంగీత ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి బయటపెట్టారు. సంగీత మొట్టమొదట క్రిష్‌ను ఒక అవార్డు వేడుకలో చూశారు. తాను “జోరు పొతే జులై గాలి” పాటకు ఉత్తమ గాయకుడిగా అవార్డును క్రిష్‌కు అందించానని తెలిపారు. అప్పటి వరకు క్రిష్ గురించి తనకు తెలియదని, గాయకుల గురించి పెద్దగా అవగాహన లేదని అన్నారు. గాయకుల గురించి లేదా సంగీతం గురించి తనకు ఏమీ తెలియదని అయితే, క్రిష్ అవార్డు స్వీకరించడానికి వేదికపైకి రాగానే, ఆయన చక్కటి రూపం, ఆకర్షణీయమైన ప్రసంగం తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. తన ప్రసంగం చాలా బాగుందని ఆమె పేర్కొన్నారు. “ఎంత అందంగా ఉన్నాడు! పెళ్లి చేసుకోవాలంటే ఇలాంటి అబ్బాయినే” అని పక్కనే ఉన్న తన తల్లితో సరదాగా అన్నానని సంగీత గుర్తు చేసుకున్నారు. అప్పుడు తన తల్లి క్రిష్ తనకంటే చిన్నవాడిగా ఉన్నాడని అన్నప్పటికీ.. తాను మాత్రం ఆయన పట్ల ఆకర్షితులైనట్లు తెలిపారు. అదే వేడుకలో, క్రిష్ ప్రదర్శన చూసిన నటి సిమ్రాన్ కూడా ఆయనను ఎంతగానో మెచ్చుకోవడం విశేషం. “సౌత్ లో ఇలా కూడా ఉన్నారా” అని సిమ్రాన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని సంగీత చెప్పారు.

అదే రోజు సాయంత్రం, అనుకోకుండా ఒక విందులో క్రిష్‌ను కలుసుకున్నారు. ఒక ఉమ్మడి స్నేహితురాలితో కలిసి క్రిష్ విందుకు వచ్చారని, ఆయన వస్తున్నారని తనకు తెలియదని సంగీత తెలిపారు. విందు బల్లపై ఇద్దరూ కలిసి కూర్చున్నప్పుడు, సంగీత క్రిష్‌ను అడిగిన మొదటి ప్రశ్న “మీ వయసు ఎంత?” అని. క్రిష్ తాను 1977లో జన్మించానని చెప్పగానే, “చూడు! నాకంటే రెండేళ్లు పెద్దవాడు” అని తన తల్లితో చెప్పి సంగీత సంతోషపడ్డారు. నంబర్లు మార్చుకున్న తర్వాత, సంగీతనే చొరవ తీసుకుని క్రిష్‌తో మాట్లాడటం ప్రారంభించారు. ఆయన తనకు బాగా నచ్చడంతో తానే కాల్ చేశానని ఆమె వివరించారు. వారిద్దరి మధ్య అవగాహన వేగంగా పెరిగింది. పరిచయం జరిగిన మూడు నెలల్లోనే నిశ్చితార్థం జరిగిందని, ఆ తర్వాత ఐదు నెలల్లో, అంటే ఫిబ్రవరిలో వారి వివాహం జరిగిందని సంగీత వెల్లడించారు. వివాహం తర్వాత, మళ్లీ అదే అవార్డు వేదికపై ఒక జంటగా హాజరై, “నాకు వరుడిని కనుగొన్నందుకు ధన్యవాదాలు” అని నిర్వాహకులకు సంగీత కృతజ్ఞతలు తెలిపారు. సంగీత, క్రిష్ దంపతులకు ఒక కుమార్తె ఉన్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

సంగీత భర్త క్రిష్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Sangeetha (@sangitha_krish)

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Follow Us