ఆగస్టు 23 రాశిఫలాలు: ఉద్యోగం, వ్యాపారాల్లో ఈ రాశులకు గుడ్‌న్యూస్..మీ రాశికి ఎలా ఉందంటే?
Horoscope Today (August 23, 2026) ఆదివారం 12 రాశుల వారికి గ్రహాల ప్రభావం వివిధ రకాల ఫలితాలను అందించే అవకాశం ఉంది. మేష రాశి వారికి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగుతుండగా, వృషభ రాశి వారికి ఉద్యోగ మార్పు ప్రయత్నాలు కొంత ఆలస్యం కావచ్చు. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

దిన ఫలాలు (ఆగస్టు 23, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వృషభ రాశి వారు ఉద్యోగం మారే ప్రయత్నాలు ప్రస్తుతానికి ఫలించకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగం మారాలనుకునేవారికి, నిరు ద్యోగులకు అవకాశాలు అందివస్తాయి. ఆదాయానికి, ఖర్చులకు పొంతన ఉండకపోవచ్చు. ముఖ్య మైన పనులు, ప్రయత్నాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రయాణాల్లో ఇబ్బంది పడడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలోనే కాక, కుటుంబంలో కూడా టెన్షన్లు, మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందరపాటు మాటలు రానివ్వవద్దు. ఉద్యోగం మారే ప్రయత్నాలు ప్రస్తుతానికి ఫలించకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరిగే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. కుటుంబ జీవితంలో కొద్దిగా కలతలు రేగే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించడం, జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. బంధువులతో మాట పట్టింపులు తలెత్తుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. బాకీలు బకాయిలు వసూలవుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తి నిపుణులకు డిమాండ్ బాగా పెరిగే అవకాశం ఉంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా, సామరస్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా కొనసాగుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో ఒత్తిడికి గురవుతారు. శుభ పరిణామం ఒకటి చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. పిల్లల్లో పురోగతి కనిపిస్తుంది. ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది. శుభ కార్యాల మీద వ్యయమవు తుంది. ఒకరిద్దరికి సాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం సజావుగా సాగుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. అదనపు బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. ఐ.టి నిపుణులకు ఉద్యోగం మారే అవకాశాలున్నాయి. పెళ్లి సంబంధం కుదరవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. కుటుంబంలో అపార్థాలు తలెత్తకుండా జాగ్రతపడాల్సి ఉంటుంది. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో ఆదరాభిమానాలకు లోటుండదు. అధికారులు ప్రత్యేక బాధ్యతల్ని అప్పగించే అవ కాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు గడించడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. శుభ కార్యాల మీద బాగా ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది. ఆద్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ప్రస్తుతానికి ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి జీవితం మీద బాగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ముఖ్యమైన అవసరాలు తీరడమే కాక, ఆర్థిక సమస్యలు కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలపై శ్రద్ధ పెంచడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలకు, ఉద్యోగం మార డానికి చేస్తున్న ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పిల్లలు వృద్ధిలోకి రావడం జరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొందరు మిత్రులకు అండగా నిలబడతారు. వ్యాపా రాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆరోగ్యం పరవాలేదు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశ మనం లభిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఉద్యోగంలో పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశిం చిన ప్రతిఫలం లభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. వృత్తి జీవితంలో బాగా డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. పిల్లల వల్ల సమస్యలు తలెత్తవచ్చు. ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కుటుంబ పెద్దల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒకరిద్దరు బంధువులకు సహాయం చేయాల్సి వస్తుంది. వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు తేలికగా సఫలమవు తాయి. ఇష్ట కార్యసిద్ధి, వ్యవహార జయం ఉంటాయి. శుభవార్తలు వినడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. మీరిచ్చే సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా కొనసాగుతుంది. వ్యాపా రాల్లో పెట్టుబడులు పెంచడానికి అవకాశం ఉంది. కుటుంబంలో సామరస్యం బాగా పెరుగుతుంది.