వరుస హిట్స్.. రిస్క్ చేస్తున్న కేరళ కుట్టి.. కమెడియన్ సరసన మమితా..
Rajitha Chanti
Pic credit - Instagram
22 August 2026
మలయాళంలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన 'ప్రేమలు' చిత్రంతో సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకున్న నటీనటులు మమితా బైజు, సంగీత్ ప్రతాప్ మళ్లీ జతకడుతున్నారు.
వీరిద్దరూ కలిసి నటిస్తున్న కొత్త మలయాళ చిత్రానికి 'హలో డియర్' (Hello Dear) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రసిద్ధ నిర్మాత ఆషిక్ ఉస్మాన్ నిర్మిస్తున్న 20వ చిత్రం ఇది కావడం విశేషం. సూపర్ హిట్ చిత్రం 'తన్నీర్మత్తన్ దినంగల్'కు రచయితగా పనిచేసి,
నటుడిగా కూడా మెప్పించిన డినోయ్ పౌలోస్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. యువతను ఆకట్టుకునేలా ఒక పూర్తిస్థాయి రొమాంటిక్ కామిడీ ఎంటర్‌టైనర్‌గా
ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఒక మెట్రో నగర నేపథ్యంలో, నేటి తరం ఆలోచనలు , జీవనశైలికి అద్దం పట్టేలా ఈ సినిమా కథాంశం ఉండబోతోంది.
'ప్రేమలు' సినిమాలో మమితా, అమల్ డేవిస్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈ జోడీ, మళ్లీ ఒకే సినిమాలో నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలో మమితా బైజు, సంగీత్ ప్రతాప్‌లతో పాటు ప్రముఖ సీనియర్ నటుడు సురేష్ కృష్ణ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారు. 'గోవింద్ వసంత' ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తుండగా,
అఖిల్ జార్జ్ ఛాయాగ్రహణం (కెమెరా), చమన్ చాకో ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కొచ్చిలో శరవేగంగా జరుగుతోంది.