
కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. తెలుగు, హిందీ భాషలలో స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. హిందీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆమె.. సూపర్ స్టార్ మహేష్ బాబు జోడిగా భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ చిత్రాల్లో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. బాలీవుడ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇటీవలే కియారా దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. కియారా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు కియారా అద్వానీ చెల్లెలి ఫోటోస్, వీడియోస్ తెగ వైరలవుతున్నాయి. ఈ క్రమంలో ఆమె గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
కియారా అద్వానీ చెల్లెలి పేరు ఇషితా అద్వానీ. అక్క ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అయితే.. చెల్లెలు మాత్రం సినీరంగానికి దూరంగా ఉంటుంది. ఆమె వృత్తిరీత్యా న్యాయవాది. కానీ అందంలో ఆమె బాలీవుడ్ హీరోయిన్ల కంటే తక్కువేమి కాదు. కియారా అద్వానీ సోదరి గురించి మరింత తెలుసుకుందాం. 1989 నవంబర్ 20న ముంబైలో జన్మించి ముంబైలోని ప్రభుత్వ లా కాలేజీ నుంచి లా పూర్తి చేసింది. ఆమె తండ్రి పేరు జగదీప్ అద్వానీ, ఆయన ఒక వ్యాపారవేత్త. తల్లి పేరు జెనీవీవ్ అద్వానీ, ఆమె ఒక ఉపాధ్యాయురాలు. కియారా కాకుండా, ఇషితకు ఇషాన్ అద్వానీ, మిషాల్ అద్వానీ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి : బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..
ఇషిత తన ప్రియుడు కర్మ వివాన్ ను 2022 మార్చి 5న వివాహం చేసుకున్నారు. అతడు కూడా న్యాయవాది కావడం గమనార్హం. 2019 సంవత్సరంలో కర్మతో ఇషిత నిశ్చితార్థం చేసుకుంది. కానీ కోవిడ్ కారణంగా వీరిద్దరి వివాహం వాయిదా పడింది. చివరకు 2022లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. కియారా, ఇషితా తరచూ బాలీవుడ్ పార్టీలలో కనిపిస్తుంటారు.
ఇవి కూడా చదవండి :
Telugu Actress : వరుసగా ప్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరోయిన్..