Vijay Antony: 7 ఏళ్ల వయసులో తండ్రి .. ఇప్పుడు కూతురు.. ‘బిచ్చగాడు’ హీరో జీవితంలో కన్నీటి విషాదాలు

|

Sep 19, 2023 | 3:07 PM

చదువుల కారణంగా మీరా గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతోందని, చికిత్స కూడా తీసుకుంటుందని సన్నిహితులు చెబుతున్నారు.ఇప్పుడు తన ఆత్మహత్యకు డిప్రెషనే కారణమని తెలుస్తోంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. విజయ్‌ ఆంటోని ఇంట్లో ఇలా ఆత్మహత్యలు జరగడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో ఆంటోనీ తండ్రి కూడా ఇలాగే ఆత్మహత్య చేసుకున్నారు.

Vijay Antony: 7 ఏళ్ల వయసులో తండ్రి .. ఇప్పుడు కూతురు.. బిచ్చగాడు హీరో జీవితంలో కన్నీటి విషాదాలు
Vijay Antony Daughter
Follow us on

బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న హీరో విజయ్‌ ఆంటోని జీవితంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆయన కూతురు మీరా ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున చెన్నైలోని తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువు చాలించింది మీరా. ఈ అమ్మాయి వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. ఇంత చిన్న వయసులోనే కూతురు కన్నుమూయడంతో విజయ్‌ ఆంటోని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయింది. ఈ హృదయ విదారక సంఘటన విజయ్‌ ఫ్యామిలీనే కాదు.. మొత్తం సినిమా ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. శరత్ కుమార్, రాఘవ లారెన్స్, వెంకట్ ప్రభు తదితర సినీ సెలబ్రిటీలు మీరా మృతికి సంతాపం తెలుపుతున్నారు. విజయ్‌ ఆంటోని కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. కాగా మీరా హఠాన్మరణానికి ఇంకా కారణం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తను చెన్నైలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది. చదువుల కారణంగా మీరా గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతోందని, చికిత్స కూడా తీసుకుంటుందని సన్నిహితులు చెబుతున్నారు.ఇప్పుడు తన ఆత్మహత్యకు డిప్రెషనే కారణమని తెలుస్తోంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. విజయ్‌ ఆంటోని ఇంట్లో ఇలా ఆత్మహత్యలు జరగడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో ఆంటోనీ తండ్రి కూడా ఇలాగే ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు విజయ్‌ వయసు కేవలం 7 సంవత్సరాలు మాత్రమే.

తన తండ్రి ఆత్మహత్యపై ఓ సందర్భంలో స్పందించిన విజయ్‌.. ఎంతో స్ఫూర్తి కలిగించే మాటలు చెప్పాడు ‘ లైఫ్‌లో ఎలాంటి సమస్యలు వచ్చినా ఆత్మహత్యలు శరణ్యం కాదు. ఇంట్లో ఎవరైనా ఇలా చనిపోతే వారి పిల్లల గురించి తలుచుకుంటే మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది. మా నాన్న కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు నా వయసు ఏడేళ్లు. మా చెల్లికి ఐదేళ్లు. నాన్న ఆత్మహత్య మా వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. నాన్న చనిపోయిన తర్వాత మమ్మల్ని పోషించడానికి అమ్మ చాలా కష్టపడింది. అందుకే ఆత్మహత్యలు గురించి విన్నప్పుడల్లా చాలా బాధేస్తోంది. నేను జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అయితే ఆత్మహత్య గురించి మాత్రం ఎప్పుడూ ఆలోచించలేదు’ అని ఎమోషనల్‌ అయ్యారు విజయ్‌.

ఇవి కూడా చదవండి

నాన్న బలవన్మరణంతో కుమిలిపోయాం..

పిల్లల ఆత్మహత్యలపై విజయ్ ఆంటోని మాట్లాడిన ఓ వీడియో కూడా ఇప్పుడు తెగ వైరలవుతోంది. ‘నేను మా అమ్మాయిని తనకు ఇష్టం వచ్చినట్లు ఉండేలా ప్రోత్సహిస్తాను. ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని చెప్పలేదు. ఏదైనా సరే తన ఇష్టానికే వదిలేశాను. చదవుల విషయంలో కూడా చాలా స్వేచ్ఛ ఇచ్చాను. చదవాలనుకుంటే చదవచ్చు. లేకుంటే లేదు. అది తన ఇష్టం. ఈ విషయంలో పిల్లలను అసలు బలవంతం చేయను. అలాగే పేరెంట్స్‌ కూడా ఎంత బిజీగా ఉన్నా తమ పిల్లలతో ప్రేమ పూర్వకంగా సాగాలి. అప్పుడే పేరెంట్స్‌, పిల్లలకు మధ్య ఒక రకమైన అనారోగ్యకరమైన బంధం ఏర్పడుతుంది’ అని విజయ్‌ చెప్పుకొచ్చారు. అలా పిల్లల పట్ల ఎంతో కేరింగ్‌గా వ్యవహరించిన విజయ్‌ జీవితంలోనే ఈ విషాదం చోటు చేసుకోవడం ఎంతో శోచనీయం. విజయ్‌, అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

చదువు విషయంలో పిల్లలను బలవంతం చేయద్దు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..