Rashmika Mandanna: రష్మిక మందన్న ఒక్క సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?.. ఆస్తులు ఎంతంటే..

గర్ల్ ఫ్రెండ్, పుష్ప 2 చిత్రాల నుంచి రష్మిక ఫస్ట్ ఫోస్టర్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. రష్మిక ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఆమె పర్సనల్ విషయాలు.. ఆస్తులు, ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. 1995లో జన్మించిన రష్మిక తొలిసారిగా కిరిక్ పార్టీ సినిమాలో నటించింది. ఆ తర్వాత అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

Rashmika Mandanna: రష్మిక మందన్న ఒక్క సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?.. ఆస్తులు ఎంతంటే..
Rashmika Net Worth
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 05, 2024 | 6:11 PM

భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. ఆమెను ముద్దుగా నేషనల్ క్రష్ అని పిలుచుకుంటారు ఫ్యాన్స్. అందం, అభినయంతో తనకంటూ ఓ క్రేజ్ సొంతం చేసుకుంది. పుష్ప, యానిమల్ సినిమాలు ఆమెకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. తనపై వచ్చే విమర్శకులకు సినిమాలతో కౌంటరిస్తుంది ఈ బ్యూటీ. ఈరోజు రష్మిక పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఆమె నటిస్తున్న సినిమాల అప్డేట్స్ కూడా రివీల్ చేశారు మేకర్స్. గర్ల్ ఫ్రెండ్, పుష్ప 2 చిత్రాల నుంచి రష్మిక ఫస్ట్ ఫోస్టర్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. రష్మిక ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఆమె పర్సనల్ విషయాలు.. ఆస్తులు, ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. 1995లో జన్మించిన రష్మిక తొలిసారిగా కిరిక్ పార్టీ సినిమాలో నటించింది. ఆ తర్వాత అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

నివేదికల ప్రకారం రష్మిక నికర విలువ దాదాపు రూ. 45 కోట్లు ఉంటుందట. అలాగే.. నెలకు రూ. 60 లక్షల వరకు సంపాదిస్తుంది. ఇక సంవత్సరానికి ఆమె ఆదాయం రూ. 8 కోట్లు ఉంటుందని సమాచారం. సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ 10 హీరోయిన్లలో రష్మిక ఒకరు. ఒక్కో సినిమాకు దాదాపు రూ.4 నుంచి 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అలాగే పుష్ప 2 తర్వాత ఆమె పారితోషికం మరింత పెంచే అవకాశం లేకపోలేదు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఆమెకు సొంతంగా ఇళ్లు ఉన్నాయి. ముంబైలో దాదాపు రూ. 8 కోట్ల విలువైన బంగ్లా ఉంది. అలాగే గోవా, కూర్గ్, హైదరాబాద్ ప్రాంతాల్లో ఆమెకు నివాసాలు ఉన్నాయి.

అలాగే రష్మికకు కార్లు అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు రేంజ్ రోవర్ స్పోర్ట్, ఆడి Q3, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా కార్లు ఉన్నాయి. ప్రస్తుతం రష్మిక పుష్ప 2 చిత్రంలో నటిస్తుంది. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా.. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.