
ప్రస్తుతం తెలంగాణ ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాను ఏలేస్తున్నాయి. ఇప్పుడు యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతున్న పాటలలో పేరుగల్ల పెద్దిరెడ్డి ఒకటి. ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ నటించిన ఈ పాట ఇప్పుడు నెట్టింట దూసుకుపోతుంది. బుల్లెట్టు బండి ఫేమ్ బండి లక్ష్మణ్ రాసిన ఈ పాట ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. ఓ తండ్రిపై కూతురు చూపించే ప్రేమను నేపథ్యంగా అద్భుతంగా లిరిక్స్ రాశారు బుల్లెట్ బండి ఫేం లక్ష్మణ్. ఇప్పుడు ఈ పాట మిలియన్ వ్యూస్ తో దుమ్మురేపుతంది. ఈపాటను మమత రమేశ్ పాడగా.. మదన్ కే మ్యూజిక్ అందించారు. పచ్చని పోలాల మధ్యలో అందమైన ప్రకృతితో ఈ పాటను మరింత అందంగా తెరకెక్కించారు. ఇందులో నాగదుర్గ లుక్స్, డ్యా్న్స్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : సుమన్ శెట్టి ప్రభంజనం.. బిగ్‌బాస్ హిస్టరీలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్.. 14 వారాలకు ఎంత సంపాదించాడంటే..
ఇదెలా ఉంటే.. ప్రస్తుతం యూట్యూబ్ సెన్సేషన్ నాగదుర్గ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగదుర్గ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కూచిపూడితో తన నృత్య ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత జానపద డ్యాన్సర్ గా మారిన నాగదుర్గ ఇప్పుడు హీరోయిన్ గా మారింది.
ఇవి కూడా చదవండి : 11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తెలుగులో తోపు హీరోయిన్..సైన్యంలో పనిచేసి ఉరి దాడిలో మరణించిన తండ్రి..
నాగదుర్గ మాట్లాడుతూ… పాటల ఎంపికలో లిరిక్స్, మ్యూజిక్‌కు ప్రాధాన్యత ఇస్తానని, కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకుంటానని వెల్లడించారు. నాలుగు సంవత్సరాల తన ప్రయాణంలో సుమారు 300 పాటలు చేశానని, ప్రతి పాటకు ప్రత్యేకత చూపించడానికి కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్, డాన్స్‌లో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తానని వివరించారు. విమర్శలను పట్టించుకోకుండా, సానుకూల వ్యక్తులతోనే తన సర్కిల్‌ను పరిమితం చేసుకుంటానని నాగదుర్గ తెలిపారు. తాను చేయనన్న కొన్ని పాటలు పెద్ద హిట్ అయ్యాయని, అలాగే తాను చేసిన పాటల విజయానికి ప్రధాన కారణం పాటలోని లిరిక్స్, మ్యూజిక్ అని, తన నృత్యం దానికి అదనపు బలంగా మాత్రమే ఉంటుందని అన్నారు. రెమ్యూనరేషన్ విషయంలో కూడా తన కెరీర్ మొదట్లో తీసుకున్న దానికి ఇప్పుడు తేడా ఉందని, తన బ్రాండ్ వాల్యూ పెరిగిందని అన్నారు. కొత్త ఛానెల్స్ అయినా, పాట నచ్చితే రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటానని నాగదుర్గ పేర్కొన్నారు. సాయి పల్లవితో పోల్చడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని, వాటిని వినకుండా తన సర్కిల్‌ను సానుకూల వ్యక్తులకు పరిమితం చేసుకుంటానని అన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను దైవ నిర్ణయంగా భావిస్తానని, అయితే తన కృషిని మాత్రం వదులుకోనని ఆమె చెప్పారు. ఎల్లమ్మ తల్లిపై తనకు ఎంతో నమ్మకం, భక్తి ఉందని, ఆమెను తన తల్లిగా భావిస్తానని తెలిపారు. నా పేరే ఎల్లమ్మ పాట చేసేటప్పుడు ఎంతో ఆనందం, అదృష్టం కలిగాయని, వేములవాడలో ఆ పాట షూటింగ్ సమయంలో అనారోగ్యంతో ఉన్నా, మొక్కుకొని పూర్తి చేశానని నాగదుర్గ గుర్తు చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి : Actress : కమిట్‌మెంట్ ఇవ్వలేదని 30 సినిమాల్లో నుంచి తీసేశారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..