Nani: ప్రజంట్ సినిమాకు కోట్లు తీసుకుంటున్న నాని.. ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెల్సా..?

|

Apr 26, 2024 | 11:56 AM

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోట్ల రూపాయలను ఛార్జ్ చేస్తున్నారు. అయితే ఆయన మొదట తీసుకున్న పారితోషకం ఎంతో తెల్సా..? ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

Nani: ప్రజంట్ సినిమాకు కోట్లు తీసుకుంటున్న నాని.. ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెల్సా..?
Actor Nani
Follow us on

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన నటులు ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేర్లు.. చిరంజీవి, రవితేజ. ఈ జనరేషన్ హీరోల్లో నాని ఆ కోవకు చెందినవాడు. బాపు, కే.రాఘవేంద్రరావు లాంటి దిగ్గజ దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్​‌గా పనిచేసిన నాని..  అష్టా-చమ్మాతో హీరోగా మారిపోయారు. ఈ సినిమాలో ఇతగాడి నేచురల్ నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. పక్కింటి కుర్రాడిలా కనిపించి ఫ్యామిలీ అడియెన్స్‌ పల్స్ పట్టేసుకున్నాడు. అమ్మాయిల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత స్కిప్ట్ సెలక్షన్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ.. విభిన్న సినిమాలు చేస్తూ.. నేచురల్ స్టార్ అనే బిరుదు తెచ్చుకున్నాడు. ఈగ, భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమగాథ, నిన్ను కోరి, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలు నానికి మంచి పేరు తెచ్చాయి. ఇక జెర్సీ సినిమా నాని కెరీర్‌లోనే ప్రత్యేకమైనది. ఆ సినిమాలో నాని నటన ఓ రేంజ్‌లో ఉంటుంది. ఎమోషన్ సీన్లలో కన్నీళ్లు పెట్టించేస్తాడు.

ఇక దసరా సినిమాతో తన రూట్ మార్చాడు నాని. పూర్థి స్థాయి మాస్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు.  ఆ సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 100 కోట్లకు పైగా రాబట్టింది. హాయ్ నాన్న కూడా డీసెంట్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం.. సినిమా రేంజ్‌ని బట్టి నాని.. 10 నుంచి 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అయితే అతడు తొలిగా అందుకున్న పారితోషకం..  రూ.2500. అది కూడా చెక్​ రూపంలో. కానీ ఆ తర్వాత ఆ చెక్ బౌన్స్ అయిందట. ఈ విషయాన్ని నానినే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం ‘అనే యాక్షన్ సినిమా చేస్తున్నాడు. డీవీవీ ఎంటర్​టైన్మెంట్స్​ బ్యానర్ నిర్మిస్తున్న..  త్వరలోనే  విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.