
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లెటెస్ట్ సినిమా అఖండ 2: తాండవం. 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అఖండ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. మొదటి సినిమాను తెరకెక్కించిన బోయపాటి శీను ఈసారి మరిన్ని హంగులతో అఖండ 2ను తెరకెక్కించారు. డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అఖండ 2 సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దైవ భక్తి, హిందూత్వం, సనాతన ధర్మం వంటి అంశాలను అఖండ 2 సినిమాలో చాలా చక్కగా చూపించారని ప్రశంసలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే మొదటి రోజే రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన అఖండ 2 మూవీ బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కాగా ఈ మూవీలో భారీ తారగణమే ఉంది. సంయుక్త మేనన్ హీరోయిన్ గా నటించగా, బజరంగీ భాయిజాన్ ఛైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా బాలయ్య కూతురిగా అద్భుతమైన పాత్ర పోషించింది. అలాగే ఆది పినిశెట్టి, కబీర్ దుల్హన్ సింగ్, సాస్వత ఛటర్జీ, అచ్యుత్ కుమార్, పూర్ణ, , హర్ష, జగపతి బాబు, రచ్చ రవి, అయ్యప్ప తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
అఖండ 2 సినిమాలో బాలయ్య నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఆయన డైలాగులు, యాక్షన్ సీన్లకు ఆడియెన్స్ చప్పట్లు కొట్టారు. అయితే ఇదే సినిమాలో శివుడి పాత్ర హైలెట్ గా నిలిచింది. అఖండ తల్లి మరణించినప్పుడు కైలాసంలోని శివుడు భువిపైకి వచ్చి ఆమె చితికి అగ్ని సంస్కారం చేస్తాడు. ఈ సన్నివేశాన్ని బోయపాటి ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. మూవీలో శివుడి పాత్ర కనిపించేది కాసేపే అయినా ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించింది. ఈ క్రమంలో బాలయ్య మూవీలో శివయ్యగా మెప్పించిన ఆ నటుడెవరు? అని నెట్టింట జనం ఆరా తీయగా ఆసక్తికర విషయలు వెలుగులోకి వచ్చాయి.
అఖండ 2 సినిమాలో శివుడి పాత్రలో మెరిసిన నటుడి పేరు తరుణ్ ఖన్నా. ఇతను తెలుగు ఆడియెన్స్ కు పెద్దగా పరిచయం లేకపోయినా బాలీవుడ్ ఆడియెన్స్ కు బాగా తెలుసు. 2015లో ప్రసారమైన సంతోషి మా సీరియల్‌లో తొలిసారి మహాశివుడిగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు తరుణ్ ఖన్నా. ఆ తర్వాత రాధాకృష్ణ, రామ్ సియాకె లవ్‌కుశ, నమః, దేవి ఆది పరాశక్తి, శ్రీమద్ రామాయణ్, వీర్ హనుమాన్: బోలో బజ్‌రంగ్ బలీకీ జై, కాల భైరవ్ రక్ష శక్తిపీఠ్ కే వంటి పలు సీరియల్స్‌లోనూ పరమ శివుడిగా వేషం కట్టి మెప్పించాడు. అలాగే చంద్రగుప్త మౌర్య సీరియల్‌లో చాణక్య పాత్రలోనూ అదరగొట్టాడు. ఇప్పుడు అఖండ సినిమాతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు తరుణ్ ఖన్నా. తనకిష్టమైన పరమ శివుడి పాత్రను అద్భుతంగా పోషించి ఆడియెన్స్ తో చప్పట్ల కొట్టించుకుంటున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.