Dharmendra : వంద ఎకరాల్లో ఇల్లు.. లగ్జరీ కార్లు.. కోట్లలో ఆస్తులు.. ధర్మేంద్ర లైఫ్ స్టైల్ చూస్తే మతిపోవాల్సిందే..

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో లెజెండరీ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. సోమవారం (నవంబర్ 24న) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సినీరంగంలో విషాదచాయలు అలుముకున్నాయి. సినీప్రముఖులు ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Dharmendra : వంద ఎకరాల్లో ఇల్లు.. లగ్జరీ కార్లు.. కోట్లలో ఆస్తులు.. ధర్మేంద్ర లైఫ్ స్టైల్ చూస్తే మతిపోవాల్సిందే..
Dharmendra

Updated on: Nov 24, 2025 | 7:51 PM

బాలీవుడ్ హీ-మ్యాన్ ధర్మ్ సింగ్ డియోల్ అకా ధర్మేంద్ర ఈరోజు తుది శ్వాస విడిచారు. డియోల్ కుటుంబ సభ్యులందరూ, బాలీవుడ్ సినీప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. కొన్నాళ్లు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. నవంబర్ 24న కన్నుమూశారు. ధర్మేంద్ర.. ధర్మేంద్ర సింగ్ డియోల్.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. యాక్షన్ కింగ్, హీ మ్యాన్‌గా ఈయన సుప్రసిద్ధుడు. పంజాబ్‌లోని లుధియానా జిల్లా, నస్రాలీ గ్రామంలో డిసెంబర్ 8, 1935న జన్మించారు ధర్మేంద్ర. పంజాబీ సంప్రదాయ కుటుంబంలో పెరగడం వల్ల క్రమశిక్షణతో కూడిన వాతావరణం ఉండేది. బాల్యం నుంచే సినిమా అంటే ఇష్టం ఉండేది.. నాటి స్టార్ యాక్టర్ దిలీప్ కుమార్ నటన ధర్మేంద్రను ప్రభావితం చేసింది. సినిమాల్లోకి రాకముందు ధర్మేంద్ర పంజాబ్‌లో చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకపోవడంతో.. ఏదో ఒక పనిచేయాలనే తపనతో ఉండేవారు. చదువు పూర్తయ్యాక, తన ఊరి దగ్గరలో ఉన్న ప్రాంతంలో రైల్వే శాఖలో క్లర్క్‌గా పనిచేశారు. ఈ సమయంలోనే ఆయనకు ప్రకాశ్ కౌర్‌తో వివాహం జరిగింది. అయితే ఆయన మనసు మాత్రం నిరంతరం సినిమాల చుట్టూనే తిరుగుతుండేది. అందుకే ఈ ఉద్యోగం చేస్తూనే.. సినిమా నటుడు కావాలనే తన కలను నెరవేర్చుకోవడం కోసం అవకాశాలను వెతుక్కునేవారు.

ఇవి కూడా చదవండి : Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..

1983లో, నటుడు ధర్మేంద్ర తన నిర్మాణ సంస్థ విజయత ఫిల్మ్స్‌ను ప్రారంభించాడు. ఈ బ్యానర్ కింద ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. 2019లో, ధర్మేంద్ర తన మనవడు కరణ్ డియోల్‌ను ‘పాల్ పాల్ దిల్ కే పాస్’ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. ధర్మేంద్ర, 2015లో న్యూఢిల్లీలోని గరం ధరమ్ ధాబాతో కలిసి రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. 2022లో, కర్నాల్ హైవేలో హీ-మ్యాన్ అనే మరో రెస్టారెంట్ స్టార్ట్ చేసారు. ధర్మేంద్ర ఆస్తులు రూ.335 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. 100 ఎకరాల ఫామ్‌హౌస్, మహారాష్ట్రలోని అతని గ్రాండ్ బంగ్లా, వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, లగ్జరీ కార్లు ఉన్నాయి. ముంబైలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నప్పటికీ.. నగర హడావిడికి దూరంగా ఉండేందుకు లోనావాలాలోని తన 100 ఎకరాల ఫామ్‌హౌస్‌ను నిర్మించుకున్నారు. ధర్మేంద్రకు మహారాష్ట్రలో రూ.17 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. ఆయన పెట్టుబడులలో రూ.88 లక్షల విలువైన వ్యవసాయ భూమి, రూ.52 లక్షల విలువైన వ్యవసాయేతర భూమి ఉన్నాయి.

ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?

ధర్మేంద్రకు కార్లంటే విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అతని మొదటి విలువైన వింటేజ్ ఫియట్ నుండి రూ. 85.74 లక్షల విలువైన రేంజ్ రోవర్ ఎవోక్, రూ. 98.11 లక్షల విలువైన మెర్సిడెస్-బెంజ్ SL500 వంటి ఆధునిక లగ్జరీ కార్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..