ఆ మెగాస్టార్‌ను మళ్లీ చూశా.. బాస్ రప్ఫాడించారు.. ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూసిన టాలీవుడ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా మన శంకరవరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మెగా మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సామాన్య ప్రేక్షకులతో పాటు హీరోలు కూడా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

ఆ మెగాస్టార్‌ను మళ్లీ చూశా.. బాస్ రప్ఫాడించారు.. మన శంకరవరప్రసాద్ గారు సినిమా చూసిన టాలీవుడ్ హీరో
Mana Shankara Vara Prasad Garu Movie

Updated on: Jan 12, 2026 | 3:04 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘మన శంకర వర ప్రసాద్‌గారు’. సంక్రాంతి కానుకగా ఇవాళ (జనవరి 12) ఈ మెగా మూవీథియేటర్లలో అడుగు పెట్టింది. ప్రీమియర్స్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పటికే రికార్డుల వేట మొదలు పెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ ఈ మెగా మూవీకి భారీ వసూళ్లు వస్తున్నాయని తెలుస్తోంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్ గా నటించింది. అలాగే విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరిశాడు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా ఈ మెగా మూవీని నిర్మించారు.

కాగా సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా మన శంకరవరప్రసాద్ సినిమాను వీక్షిస్తున్నాను. కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్లకు వెళ్లి మెగా మూవీని ఆస్వాదిస్తున్నారు. అనంతరం ఆ విశేషాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మన శంకరవరప్రసాద్ గారు సినిమాను చూశారు. అనంతరం ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ‘ఆ స్వాగ్ .. స్టైలూ .. ఆ టైమింగు ..మళ్లీ చూసాం.. నిన్న రాత్రి ఇవన్నీ ఇంతలా ఉంటుంది అని తెలియక నార్మల్‌గా థియేటర్లోకి వెళ్లాం.. ఇప్పుడు పక్కా ప్లాన్డ్‌గా పేపర్స్ తో వెళ్దాం.. అనిల్ రావిపూడి అన్నా.. చిరంజీవి.. వెంకీ మామ సార్ ఆ ఇంటర్వెల్ షాట్.. రఫ్పాడించారు’ అని రాసుకొచ్చాడు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతంఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

కిరణ్ అబ్బవరం ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .