Kiraak RP: ‘కిర్రాక్‌ ఆర్పీ నెల్లూరు చేపల పులుసు చాలా కాస్ట్‌లీ’.. విమర్శలపై జబర్దస్త్ కమెడియన్ ఏమన్నాడంటే?

|

Feb 02, 2024 | 10:25 PM

టీవీ షోలకు స్వస్తి చెప్పిన ఆర్పీ ఆ మధ్యన చేపల పులుసు కర్రీ పాయింట్‌ బిజినెస్‌తో నిత్యం వార్తల్లో నిలిచాడు. మొదట కూకట్‌ పల్లిలో నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు అంటూ కర్రీ పాయింట్‌ను ఓపెన్‌ చేసిన కిర్రాక్‌ ఆర్పీ ఆ తర్వాత మణికొండ, అమీర్‌ పేట తదితర ప్రాంతాల్లో బ్రాంచ్‌లు కూడా ఓపెన్‌ చేశాడు

Kiraak RP: కిర్రాక్‌ ఆర్పీ నెల్లూరు చేపల పులుసు చాలా కాస్ట్‌లీ.. విమర్శలపై జబర్దస్త్ కమెడియన్ ఏమన్నాడంటే?
Kiraak RP
Follow us on

కిర్రాక్‌ ఆర్పీ అలియాస్‌ రాటకొండ ప్రసాద్‌.. జబర్దస్త్‌ కామెడీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్‌ కమెడియన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనదైన పంచులు, ప్రాసలతో కడుపుబ్బా నవ్వించాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. అయితే టీవీ షోలకు స్వస్తి చెప్పిన ఆర్పీ ఆ మధ్యన చేపల పులుసు కర్రీ పాయింట్‌ బిజినెస్‌తో నిత్యం వార్తల్లో నిలిచాడు. మొదట కూకట్‌ పల్లిలో నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు అంటూ కర్రీ పాయింట్‌ను ఓపెన్‌ చేసిన కిర్రాక్‌ ఆర్పీ ఆ తర్వాత మణికొండ, అమీర్‌ పేట తదితర ప్రాంతాల్లో బ్రాంచ్‌లు కూడా ఓపెన్‌ చేశాడు. ఆ తర్వాత ఏపీలోకి కూడా అడుగు పెట్టాడు. నెల్లూరు, తిరుపతిలోనూ నెల్లూరు చేపల పులుసు కర్రీ పాయింట్లు ఓపెన్‌ చేశాడు. బిజినెస్‌ కూడా బాగానే ఉందంటున్నాడబు కిర్రాక్ ఆర్పీ. అదే సమయంలో అతని చేపల పులుసు కర్రీ పాయింట్‌లో కూరలు చాలా కాస్ట్‌లీ ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. తాజాగా వీటిపై స్పందించిన ఆర్పీ తన దైన శైలిలో సమాధానమిచ్చాడు.

‘మీరు కిలో చికెన్‌ కొంటే కిలో చేతిక వస్తుంది. మటన్‌ కూడా అంతే. కానీ కిలో చేప తీసుకుంటే మాత్రం కిలో రాదు. తల కాయ, తోకా పోతాయి. మధ్యలో ఉండే పీసులే నేను అమ్మాలి. ఇతర కూరల్లో వేసిన దానికి వంద రెట్లు ఎక్కువగా చేపల కూరలో నూనే వేయాలి. రుచి కోసం మామిడి కాయలు కూడా జత చేయాలి. అవి కూడా చాలా రేట్లు పలుకుతున్నాయి. ఇవొక్కటే కాదు.. ధనియాలు, జీలకర్ర, మెంతులు ఆఖరిలో వేసే మసాలా, కొత్తిమీర.. ఇలా చేపల కర్రీకి ఉపయోగించే పదార్థాల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటికి తగ్గట్టుగానే నా కర్రీపాయింట్‌లో ధరలు ఉన్నాయి. ఎవరూ కూడా కావాలని అత్యధిక రేట్లు పెట్టరు. రేట్లు ఎక్కువ పెట్టడం వల్ల వ్యాపారం జరగదు అని తెలిసినప్పుడు నేను రేట్లు ఎందుకు ఎక్కువ పెడతాను. ఇది మామూలు రిస్కీ బిజినెస్ కాదు. నేను కూడా నాసిరకమైన చేపలు తెచ్చి అల్లం పేస్ట్ కలిపి ఊరికే కూడా ఇస్తాను. మీరు మంచి చేపలు తిని బాగుండాలని కోరుకుంటున్నా కాబట్టి రేట్లు అలా పెట్టవలసి వస్తుంది’ అంటూ నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు రేట్లపై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చాడు కిర్రాక్‌ ఆర్పీ.

ఇవి కూడా చదవండి

 

శ్రీవారి సేవలో ఆర్పీ, లక్ష్మీ ప్రసన్న..

ఆర్పీ, లక్ష్మీ ప్రసన్నల ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..