Kiara Advani: డబ్బుకోసం అలాంటి పని అస్సలు చేయను.. కియారా అద్వానీ షాకింగ్ కామెంట్స్

మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో కియారా అద్వానీ తన నటనతో ఆకట్టుకుంది. ఆతర్వాత బోయపాటి దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామా అనే సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమాలో కియారా అద్వానీ నటన తో పాటు తన అందంతోనూ ఆకట్టుకుంది. ఆతర్వాత తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది.

Kiara Advani: డబ్బుకోసం అలాంటి పని అస్సలు చేయను.. కియారా అద్వానీ షాకింగ్ కామెంట్స్
Kiara Advani

Updated on: Sep 06, 2023 | 8:54 AM

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ చాలా మంది తెలుగులో సినిమాలు చేశారు. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే.. అప్పుడప్పుడూ తెలుగు సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటున్నారు. అలా వచ్చిన వారిలో కియారా అద్వానీ ఒకరు. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో కియారా అద్వానీ తన నటనతో ఆకట్టుకుంది. ఆతర్వాత బోయపాటి దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామా అనే సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమాలో కియారా అద్వానీ నటన తో పాటు తన అందంతోనూ ఆకట్టుకుంది. ఆతర్వాత తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వారస ఆఫర్స్ అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

ఇక ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి అవుతుంది. మరోసారి రామ్ చరణ్ కు జంటగా నటిస్తుంది కియారా. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ గేమ్ చెంజర్. ఈ సినిమాలో చరణ్ కు జోడిగా కనిపించనుంది కియారా అద్వానీ. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే బాలీవుడ్ లోనూ పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది ఈ బ్యూటీ.

తాజాగా క్రియ అద్వానీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కథ నచ్చితే ఎలాంటి పాత్రలో నటించడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపింది కియారా అద్వానీ. కథకు కనెక్ట్ అయితే గ్లామర్ షోకు కూడా రెడీ అని తెలిపింది.

అయితే కథ నచ్చకపోతే అస్సలు సినిమా చేయను. ఎంత రెమ్యునరేషన్ ఎక్కువగా ఇచ్చిన కూడా కథ నచ్చకపోతే సినిమా చేయను అని తెగేసి చెప్పింది కియారా. డబ్బు కోసం తనకు నచ్చని పని చేయని అని తెలిపింది. కియారా కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. శంకర్ సినిమా తర్వాత ఈ అమ్మడికి తెలుగులోకూడా అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది. మరోసారి తెలుగులో స్టార్ హీరోల సినిమాలతో బిజీ కానుందని టాక్ వినిపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..