Sidharth Malhotra: కియారా పెళ్లాడిన ఈ హీరో ఆస్తివిలువ ఎంతో తెలుసా..

బాలీవుడ్ లో సిద్ధార్థ్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. సిద్ధార్థ్‌ ఎప్పుడు తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. నేడు సిద్ధార్థ్ పుట్టినరోజు. సినీ సెలబ్రెటీలు, ఫ్యాన్స్ ఆయనకు పుట్టిన రోజు విషెస్ తెలుపుతున్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్ సంపదపై గురించిన ఆసక్తికర జరుగుతోంది బాలీవుడ్ లో..

Sidharth Malhotra: కియారా పెళ్లాడిన ఈ హీరో ఆస్తివిలువ ఎంతో తెలుసా..
Sidharth Malhotra

Updated on: Jan 16, 2024 | 6:14 PM

చాలా తక్కువ కాలంలోనే బాలీవుడ్ లో సిద్ధార్థ్ బాలీవుడ్‌లో తనకంటూ ఒక స్థిరత్వాన్ని సంపాదించుకున్నాడు. అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ లో సిద్ధార్థ్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. సిద్ధార్థ్‌ ఎప్పుడు తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. నేడు సిద్ధార్థ్ పుట్టినరోజు. సినీ సెలబ్రెటీలు, ఫ్యాన్స్ ఆయనకు పుట్టిన రోజు విషెస్ తెలుపుతున్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్ సంపదపై గురించిన ఆసక్తికర జరుగుతోంది బాలీవుడ్ లో.. ఇటీవల సిద్ధార్థ్‌ హీరోయిన్ కియారా అద్వానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సిద్ధార్థ్ మల్హోత్రా ఢిల్లీలో జన్మించాడు. మొదట్లో సిద్ధార్థ్ తనఖర్చుల కోసం మోడలింగ్ చేయడం ప్రారంభించాడు.. సిద్ధార్థ్ మోడలింగ్ రంగంలో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.

మోడలింగ్ తర్వాత, సిద్ధార్థ్ బుల్లితెరలో నటించడం ప్రారంభించాడు. సిద్ధార్థ్ ‘ధర్తి కా వీర్ యోద్ధ పృథ్వీరాజ్ చౌహాన్’ సీరియల్‌ లో నటించాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో సిద్ధార్థ్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ వెనుదిరిగి చూడలేదు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమా తర్వాత సిద్ధార్థ్ బాలీవుడ్‌లో ‘మర్జావాన్’, ‘ఏక్ విలన్’, ‘అయ్యారీ’, ‘కపూర్ అండ్ సన్స్’, ‘బార్-బార్ దేఖో’ వంటి హిట్ చిత్రాల్లో నటించాడు. అలాగే ‘షేర్షా’ సినిమా ద్వారా సిద్ధార్థ్ పాపులారిటీ బాగా పెరిగిపోయింది.. ఆ సినిమాలో కియారా లీడ్ రోల్ చేసింది. సిద్ధార్థ్ కియారా జోడీ రీల్ అలాగే రియల్ లైఫ్లోనూ హిట్ అయ్యింది.

సిద్ధార్థ్ మల్హోత్రా ఆస్తుల విషయానికొస్తే.. ఆయన ఆస్తుల విలువ రూ.95 కోట్లు. ఆయన ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో విలాసవంతమైన ఇళ్లు ఉంది. సిద్ధార్థ్ నటుడిగానే కాకుండా మోడల్ గాను చేస్తున్నాడు. సిద్ధార్థ్ సంవత్సరానికి దాదాపు 6 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. సిద్ధార్థ్‌కి బైక్‌లు, లగ్జరీ కార్లు అంటే చాలా ఇష్టం, అతనికి 14 లక్షల రూపాయల విలువైన హార్లే డేవిడ్‌సన్ అమెరికన్ బైక్ అదేవిద్మగా రేంజ్ రోవర్, ఎస్యూవీ , మెరిసిడాస్ బెంజ్ ML 350 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.