KGF2 Television Premiere: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఈ ఏడాది రిలీజైన చిత్రం కేజీఎఫ్ ఛాప్టర్2 (KGF Chapter 2). కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.
KGF2 Television Premiere: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఈ ఏడాది రిలీజైన చిత్రం కేజీఎఫ్ ఛాప్టర్2 (KGF Chapter 2). కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. యశ్ మాస్ యాక్షన్‌కు తోడు ప్రశాంత్ టేకింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఈ ఏడాది ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఆల్ టైం హైయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ఆ స్థాయి వసూళ్లు సాధించిన ఈ సినిమా ఓటీటీలోనూ సత్తాచాటింది. ఇప్పుడు స్మాల్‌స్ర్కీన్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది.
ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకోగా.. తాజాగా ఈ మూవీ టెలికాస్ట్ డేట్‌ని ఫిక్స్ చేశారు. ఆగస్టు 21న సాయంత్రం 5.30 గంటలకు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఒక అనౌన్సమెంట్ పోస్టర్‌ని విడుదల చేశారు. కేజీఎఫ్‌లో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మరి థియేటర్లలో, ఓటీటీల్లో కేజీఎఫ్ హంగామాను చూడని వారు ఎంచెక్కా టీవీల్లో చూసి ఎంజాయ్ చేయండి.