KGF Chapter2: విడుదలకు ముందే రికార్డులు మొదలు పెట్టిన కేజీఎఫ్ 2… సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్..

| Edited By: Rajitha Chanti

Apr 25, 2021 | 11:12 AM

కేజీఎఫ్ సినిమాతో కన్నడ బాషలోనే కాదు అన్ని భాషల్లోనూ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో రాక్ స్టార్ యశ్ ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

KGF Chapter2: విడుదలకు ముందే రికార్డులు మొదలు పెట్టిన కేజీఎఫ్ 2... సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్..
Follow us on
KGF Chapter2: కేజీఎఫ్ సినిమాతో కన్నడ బాషలోనే కాదు అన్ని భాషల్లోనూ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో రాక్ స్టార్ యశ్ ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కేజీఎఫ్ సినిమా ఒక్కసారిగా హీరో యష్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇటీవల విడుదలైన కేజీఎఫ్ 2 టీజర్ రికార్డులను తిరగరాస్తుంది. ఫాస్టెస్ట్ వ్యూస్ లైక్స్ సాధించిన తొలి చిత్రంగా ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ఈ సినిమాకోసం అన్నిభాషల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రైట్స్ ను దక్కించుకోవడంకోసం తెలుగు రాష్ట్రాల డిస్టిబ్యూటర్స్ పోటీపడుతున్నారట.

చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని జులై 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలా ఉంటే యశ్ తో పాటు ఈ సినిమాలో పలువురు ప్రముక బాలీవుడ్ స్టార్స్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాలో కీలకమైన అధీరా పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్న విషయం తెల్సిందే. అయితే అత్యంత క్రూరమైన పాత్ర అధీరాగా సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. ఈ సినిమా లో ఓ భారీ ట్వీట్ ఉండనుందట.. అదేంటంటే క్లైమాక్స్ లో హీరో పాత్ర చనిపోతే విలన్ అధీరా హీరోగా మారుతాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక అప్పుడే ‘బుక్ మై షో’ లో 300K మందికి పైగా ఈ మూవీపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది ఇండియాలోనే ఏ సినిమాకు రాని రెస్పాన్స్ అని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ram Charan: త్వరలో రామ్ చరణ్ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రాబోతోందా..

 Pawan Kalyan: మహేష్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా.. దిల్ రాజు ప్లాన్ అదుర్స్..

Vijay Deverakonda: ఇన్‌స్టా ఫాలోవర్స్‌ విషయంలో సౌత్‌లో నెంబర్ వన్‌ ప్లేస్‌లో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ