Raghu Thatha: పెద్ద సినిమాలకు పోటీగా కీర్తిసురేష్ సినిమా.. రఘుతాత ట్రైలర్ చూశారా..

|

Jul 31, 2024 | 6:46 PM

ఇప్పటికే మూడు నాలుగు లేడీ ఓరియేంటేడ్ మూవీస్ చేసింది కీర్తిసురేష్. ఇక ఇప్పుడు మరో లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ నిర్మాణ సంస్థ హోంబాలే కీర్తిసురేష్ తో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు, మలయాళ భాషల్లో ‘హోంబాలే’ సినిమా నిర్మించింది. ఇప్పుడు తమిళంలో కూడా సినిమాలను నిర్మిస్తున్నారు.

Raghu Thatha: పెద్ద సినిమాలకు పోటీగా కీర్తిసురేష్ సినిమా.. రఘుతాత ట్రైలర్ చూశారా..
Keerthy Suresh Raghu Thatha
Follow us on

స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా చేస్తూనే మరో వైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తోంది ఈ భామ. ఇప్పటికే మూడు నాలుగు లేడీ ఓరియేంటేడ్ మూవీస్ చేసింది కీర్తిసురేష్. ఇక ఇప్పుడు మరో లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ నిర్మాణ సంస్థ హోంబాలే కీర్తిసురేష్ తో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు, మలయాళ భాషల్లో ‘హోంబాలే’ సినిమా నిర్మించింది. ఇప్పుడు తమిళంలో కూడా సినిమాలను నిర్మిస్తున్నారు. రఘుతాత అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు (జులై 31) విడుదల చేశారు. అలాగే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు.

‘కేజీఎఫ్‌’, ‘సలార్‌’, ‘కాంతార’ వంటి భారీ బడ్జెట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాలను నిర్మించిన హోంబాలే.. మహిళా లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘రఘుతాత’ను నిర్మించారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కథ తమిళనాడులోని ఓ కుగ్రామంలో జరుగుతుంది. సినిమా కథ హిందీ ఇంపోజిషన్ గురించి. ఇందిరాగాంధీ కాలం నాటి కథను సినిమాలో చూపించనున్నారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో కీర్తిసురేష్ మరోసారి డీ గ్లామర్ రోల్ లో కనిపించనుంది. సినిమా లొకేషన్, ఇతర పాత్రల నటన కూడా ట్రైలర్‌లో అందరినీ ఆకర్షిస్తోంది.

రఘుతాత చిత్రానికి సుమన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం సీన్ రోల్డాన్ అందిస్తున్నారు. విజయ్ కిర్గందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది. అదే రోజున కొన్ని పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. ముఖ్యంగా తమిళంలో చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తంగళన్’. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డబుల్ స్మార్ట్’, అలాగే రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ విడుదల కానున్నాయి. వీటి మధ్య ‘రఘు తాత’ నిలబడుతుందేమో వేచి చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి