AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మన్మథుడు హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెల్సా.? అందం చూస్తే మతిపోవాల్సిందే

మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. కానీ అందులో కొందరు ఇలా వచ్చి.. తమ నటనతో ఇంప్రెస్ చేసి.. ఆడియన్స్ దగ్గర మంచి మార్కులు కొట్టేసి.. అలా కనుమరుగైపోతారు. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినప్పటికీ.. ఏదొక కారణంతో ఇండస్ట్రీకి దూరమైపోతారు.

Tollywood: మన్మథుడు హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెల్సా.? అందం చూస్తే మతిపోవాల్సిందే
Tollywood
Ravi Kiran
|

Updated on: Jul 31, 2024 | 8:03 PM

Share

మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. కానీ అందులో కొందరు ఇలా వచ్చి.. తమ నటనతో ఇంప్రెస్ చేసి.. ఆడియన్స్ దగ్గర మంచి మార్కులు కొట్టేసి.. అలా కనుమరుగైపోతారు. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినప్పటికీ.. ఏదొక కారణంతో ఇండస్ట్రీకి దూరమైపోతారు. ఆ కోవకు చెందిన ఓ హీరోయిన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆమె మరెవరో కాదు.. అన్షు అంబానీ.. ఈ పేరు చెబితే ఎవరూ పెద్దగా గుర్తురాకపోవచ్చు. కానీ నాగార్జున హీరోగా వచ్చిన మన్మథుడు సినిమా హీరోయిన్‌ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సినిమాలో సోనాలీ బింద్రే మెయిన్ హీరోయిన్ కాగా.. అన్షు అంబానీ సెకండ్ హీరోయిన్‌గా నటించింది. మహేశ్వరి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించిన అన్షు. తనకిచ్చిన పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి అందరినీ మెస్మరైజ్ చేసింది. ఈ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. ఫ్యాన్స్‌కు మాత్రం ఇప్పటికీ గుర్తుండిపోతుంది.

ఇది చదవండి: ఆహా.! ఏం వయ్యారం గురూ.. అప్పుడేమో పద్దతిగా చుడీదార్‌లో.. ఇప్పుడేమో నడుమందాలతో..

ఈ మూవీతో పాటు ప్రభాస్ సరసన ‘రాఘవేంద్ర’ అనే సినిమాలో.. ‘మిస్సమ్మ’ అనే మరో సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించింది అన్షు. ఇలా తెలుగులో చాలా తక్కువ సినిమాల్లో నటించిన అన్షు. ఇండస్ట్రీకి దూరమై లండన్‌లో వెళ్లి సెటిలైపోయింది. అక్కడే పుట్టి పెరిగిన ఈ నటి.. తెలుగు ఇండస్ట్రీకి కూడా ఓ అతిధిలా వచ్చి వెళ్లింది. 2003లో సచిన్ సగ్గార్ అనే లండన్‌కు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది అన్షు అంబానీ. వీరికి ఓ పాప, బాబు. ప్రస్తుతం ఈమె లండన్‌లో ఇన్‌స్పిరేషన్ కౌచర్ అనే క్లాతింగ్ షాప్ రన్ చేస్తుంది. ఇండస్ట్రీకి దూరమై 21 ఏళ్లు గడుస్తున్నప్పటికీ.. ఏమాత్రం చెక్కుచెదరని అందంతో మెస్మరైజ్ చేస్తోంది ఈ భామ. తన భర్త, పిల్లలతో కలిసి వెకేషన్లకు వెళ్లిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేస్తూ సందడి చేస్తోంది ఈ భామ. కాగా, ఆ మధ్య అన్షు అంబానీ మళ్లీ ఇండస్ట్రీకి కమ్ బ్యాక్ ఇస్తోందని వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ కూడా రూమర్స్ అని కొట్టిపారేశారు అన్షు సన్నిహితులు.

ఇది చదవండి: కునుకేశారో దెయ్యానికి దొరికిపోతారు.! సీన్ సీన్‌కు సుస్సుపడాల్సిందే.. మూవీ ఏ ఓటీటీలో చూడొచ్చునంటే

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..