Nithin Keerthi Suresh: కీర్తి సురేశ్‌ను నితిన్‌ ఎలా రెచ్చగొట్టాడో చూశారా..? నవ్వులు పూయిస్తున్న వీడియో

Nithin Keerthi Suresh: నితిన్ హీరోగా వెంటీ అట్లూరీ దర్శకత్వంలో 'రంగ్‌దే' సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు...

Nithin Keerthi Suresh: కీర్తి సురేశ్‌ను నితిన్‌ ఎలా రెచ్చగొట్టాడో చూశారా..? నవ్వులు పూయిస్తున్న వీడియో
Keerthi Suresh Nithin

Edited By: Rajitha Chanti

Updated on: Mar 19, 2021 | 9:58 AM

Nithin Keerthi Suresh: నితిన్ హీరోగా వెంటీ అట్లూరీ దర్శకత్వంలో ‘రంగ్‌దే’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్‌ విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌, లిరికల్‌ సాంగ్స్‌, టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే కీర్తి సురేశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేసిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ఇంతకీ వీడియోలో ఏముందంటే.. కీర్తి సురేశ్‌, నితిన్‌ ఏదో షూటింగ్‌ సెట్‌లో ఉన్న సమయంలో కీర్తి డైటింగ్‌లో భాగంగా పండ్లు తింటోంది. అయితే నితిన్‌ మాత్రం చేతిలో పిజ్జా పట్టుకొని కీర్తికి చూపిస్తూ తన డైట్‌ను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. అయితే కీర్తి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పిజ్జా తినేది లేదంటూ తనను తాను కంట్రోల్‌ చేసుకుంది. కానీ కొద్ది సేపటి తర్వాత నోట్లో నీళ్లు ఊరడంతో కంట్రోల్‌ చేసుకోలేని కీర్తి డైట్‌ని పక్కన పెట్టేసి ఎంచక్క పిజ్జా తినేసింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫన్నీ వీడియో నెటిజెన్లను ఆకట్టుకుంటోంది. మరి ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

కీర్తి సురేశ్‌ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌..

Also Read: Ek Mini Katha : ‘ఈ మాయలో..’ అంటూ ప్రేమగీతాలు పాడుతున్న సంతోష్ శోభన్… ఏక్ మినీ కథ నుంచి అందమైన మెలోడీ

క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రానున్న ‘ప‌చ్చీస్’ మూవీ.. క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా టీజర్.. ఇంట్రస్టింగ్ గా ఉందన్న రౌడీ..‌

Sashi Song : ఆది సాయి కుమార్ ‘శశి’ మూవీ నుంచి మరో అందమైన పాట.. నెల 19న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు సినిమా