Keerthy Suresh: ‘ఆ వీడియో చూస్తే భయమేస్తుంది.. పుణ్యమో.. శాపమో తెలియట్లేదు’.. కీర్తి సురేష్ పోస్ట్ వైరల్..

రష్మికతోపాటు మరికొందరి హీరోయిన్స్ సైతం ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని.. వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే రష్మికకు టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో చూసి తాను భయపడ్డానని.. టెక్నాలజీని రావడం పుణ్యమా, శాపమా అర్థం కావడం లేదని తన ఇన్ స్టా స్టోరీలో ఆవేదన వ్యక్తం చేసింది కీర్తి సురేష్. ప్రస్తుతం వైరల్ అవుతున్న డీప్‌ఫేక్ వీడియో చూసి తాను భయపడుతున్నానని

Keerthy Suresh: ఆ వీడియో చూస్తే భయమేస్తుంది.. పుణ్యమో.. శాపమో తెలియట్లేదు.. కీర్తి సురేష్ పోస్ట్ వైరల్..
Keerthy Suresh

Updated on: Nov 09, 2023 | 1:24 PM

టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ ఫేక్ వీడియోపై సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్‌కు చెందిన జరా పటేల్ వీడియోకు.. రష్మిక ఫేస్ జత చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుంది. రష్మికతోపాటు మరికొందరి హీరోయిన్స్ సైతం ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని.. వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే రష్మికకు టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో చూసి తాను భయపడ్డానని.. టెక్నాలజీని రావడం పుణ్యమా, శాపమా అర్థం కావడం లేదని తన ఇన్ స్టా స్టోరీలో ఆవేదన వ్యక్తం చేసింది కీర్తి సురేష్.

ప్రస్తుతం వైరల్ అవుతున్న డీప్‌ఫేక్ వీడియో చూసి తాను భయపడుతున్నానని ఇన్‌స్టా స్టోరీస్‌లో కీర్తి సురేష్ తెలిపింది. టెక్నాలజీని మంచికి ఉపయోగించవచ్చు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ పుణ్యమా.. శాపమో తెలియదు. ప్రేమ, సానుకూలత , అవగాహనను పెంచేందుకు మాత్రమే టెక్నాలజీని ఉపయోగించుకుందాం. అప్పుడే దేవుడు మనల్ని రక్షిస్తాడు అంటూ రాసుకొచ్చింది.

అలాగే రష్మిక ఫేక్ వీడియోపై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలని.. అలాగే సైబర్ డిపార్ట్మెంట్ ఇలాంటివి త్వరగానే అరికట్టేలా.. వాటికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించేలా చట్టం తీసుకురావాలని చెప్పుకొచ్చాడు విజయ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.