Raghu Thatha OTT: డైరెక్ట్‌ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ కాంట్రవర్సీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

|

Aug 21, 2024 | 11:40 AM

ప్రముఖ దక్షిణాది హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ అందాల తార మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోనూ మెరుస్తోంది. అలా కీర్తి సురేశ్ నటించిన మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ రఘు తాత. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ రైట‌ర్‌ సుమ‌న్ కుమార్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Raghu Thatha OTT: డైరెక్ట్‌ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ కాంట్రవర్సీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Raghu Thatha Movie
Follow us on

ప్రముఖ దక్షిణాది హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ అందాల తార మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోనూ మెరుస్తోంది. అలా కీర్తి సురేశ్ నటించిన మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ రఘు తాత. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ రైట‌ర్‌ సుమ‌న్ కుమార్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎమ్ఎస్ భాస్క‌ర్‌, ర‌వీంద్ర విజ‌య్ కీల‌క పాత్ర‌లు పోషించారు. కేజీఎఫ్, సలార్ సినిమాలతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకున్న హోంబ‌లే ఫిల్మ్స్ సంస్థ రఘు తాత సినిమాను నిర్మించడం విశేషం. ఆగస్టు15న తమిళంలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. తెలుగులో మాత్రం ఈ సినిమా రిలీజ్ కాలేదు. దీంతో కీర్తి సురేశ్ అభిమానులు బాగా డిజప్పాయింట్ అయ్యారు. అయితే రఘుతాత సినిమా తెలుగు వెర్షన్ డైరెక్టుగా ఓటీటీలోకి రిలీజ్ కానుందని సమాచారం. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. తెలుగు, త‌మిళం,మ‌ల‌యాళం, క‌న్న‌డ స్ట్రీమింగ్‌ హ‌క్కుల‌కు సంబంధించి మూవీ మేకర్స్, ఓటీటీ సంస్థల మధ్య భారీ డీల్ కుదిరినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో సెప్టెంబ‌ర్ మొదటి వారం లేదా సెప్టెంబర్‌ 14న రఘుతాత తెలుగు వర్షన్‌ ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల కానుందని టాక్. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. రఘు తాత సినిమా విషయానికి వస్తే.. హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అనే విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు మహిళలపై జరుగుతున్న పలు సంఘటనల ఆధారంగా రఘుతాత సినిమాను నిర్మించారు. ముఖ్యంగా హిందీ భాషను వ్యతిరేకించే అమ్మాయి పాత్రలో కీర్తి సురేశ్ అద్భుతంగా నటించింది.

ఇవి కూడా చదవండి

హిందీ భాషకు వ్యతిరేకంగా ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.