AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 కిలోల వెయిట్‌ లాస్..! సర్జరీ రూమర్స్‌పై తొలిసారి నోరు విప్పిన స్టార్ హీరోయిన్

వెండితెరపై తన నటనతో, సహజ సిద్ధమైన అందంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఆ స్టార్ హీరోయిన్.. ఇన్నాళ్లుగా తాను రహస్యంగా ఉంచిన ఒక విషయాన్ని వివరిస్తూ తన ఫిట్‌నెస్ ప్రయాణాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. గత కొన్నేళ్లుగా తాను జిమ్‌లో చేసిన కఠినమైన వర్కవుట్లకు సంబంధించిన వీడియోల సమాహారాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, శారీరకంగా మరియు మానసికంగా తాను ఎంతటి మార్పును సాధించారో అభిమానులకు చూపించారు. ఫిట్‌నెస్ అనేది తన జీవితంలో "అత్యంత పెద్ద గురువు" అని పేర్కొంటూ, నేటికీ ప్రతిరోజూ తన శరీరం గురించి కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నానని ఆమె వెల్లడించారు.

10 కిలోల వెయిట్‌ లాస్..! సర్జరీ రూమర్స్‌పై తొలిసారి నోరు విప్పిన స్టార్ హీరోయిన్
Keerthy Suresh On Weight Loss
Nikhil
|

Updated on: May 19, 2026 | 6:30 AM

Share

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు అసలు ఏమీ తెలియని ఒక చిన్న పిల్లలా ఉండేదానినని, జిమ్‌కు వెళ్లి వర్కవుట్స్ చేయడం తన వల్ల అయ్యే పని కాదని అనుకునేదానినని స్టార్​ హీరోయిన్ కీర్తి సురుష్​ ఇన్​స్టా వేదికగా రాసుకొచ్చారు. “చాలా మందిలాగే నేను కూడా జిమ్ నాకు సెట్ కాదని భావించాను” అని పేర్కొంటూ, ఆ సమయంలో తన శరీరానికి కనీస అవసరమైన వ్యాయామాలను సైతం నిర్లక్ష్యం చేశానని తెలిపారు. అయితే, ‘మహానటి’ చిత్రం తర్వాత ఆమె ఆలోచనల్లో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది.

9 నెలల్లో 10 కిలోల బరువు తగ్గుదల..

2018లో వచ్చిన ‘మహానటి’ చిత్రంలో తన నటనకు జాతీయ అవార్డు అందుకున్న తర్వాత, వచ్చిన ఒక చిన్న విరామంలో కీర్తి ఫిట్‌నెస్‌ను ఎంతో సీరియస్‌గా తీసుకున్నారు. ఇందులో భాగంగానే హెచ్ఐఐటి (HIIT) వర్కవుట్లు, కార్డియో వ్యాయామాలతో పాటు హై-ప్రోటీన్, లో-కార్బ్ డైట్‌ను కఠినంగా పాటించారు. ఈ పట్టుదల కారణంగా కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే ఆమె ఏకంగా 10 కిలోల బరువు తగ్గారు. ఈ అద్భుతమైన శారీరక మార్పును చూసి ఆమె ఎంతో గర్వపడినప్పటికీ, అదే సమయంలో సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని నెగెటివ్ కామెంట్లు ఆమెను తీవ్రంగా బాధించాయి.

ఆమెను చూసిన చాలామంది చాలా “బలహీనంగా” మారిపోయిందని ఎగతాళి చేశారు, అంతేకాకుండా ఆమె బరువు తగ్గడానికి ఏవో ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందని పుకార్లు సృష్టించారు. ఈ రూమర్లపై స్పందిస్తూ.. “నేను నా ముఖానికి కూడా ఎటువంటి సర్జరీలు చేయించుకోలేదు, నా అందం ఎప్పుడూ సహజ సిద్ధమైనదే” అని ఆమె స్పష్టం చేశారు. తాను పడిన కష్టాన్ని గుర్తించకుండా, ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేయడం తనను కొంతవరకు బాధించాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

యోగాతో బంధం..

2020లో కీర్తి యోగా వైపు అడుగులు వేశారు. యోగా సాధన చేయడం వల్ల ఫిట్‌నెస్‌తో తనకున్న బంధం పూర్తిగా మారిపోయిందని ఆమె చెప్పారు. యోగా తనకు జీవితంలో గొప్ప సమతుల్యతను, ఆత్మవిశ్వాసాన్ని మరియు తన శరీరాన్ని తానే ప్రేమించుకునే ఒక ఆరోగ్యకరమైన మార్గాన్ని నేర్పిందని కొనియాడారు. కాలక్రమేణా జిమ్‌లో లోపం లేదని, గతంలో తాను అనుసరించిన పద్ధతిలోనే లోపం ఉందని ఆమె గ్రహించారు. ప్రస్తుతం ఆమె దినచర్యలో స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది ఒక ముఖ్య భాగమైపోయింది. బరువులు ఎత్తడంతో పాటు యోగా, యానిమల్ ఫ్లో, కార్డియో మరియు కాలిస్థెనిక్స్ వంటి విభిన్న వ్యాయామాలను ప్రతిరోజూ మిక్స్ చేసి సాధన చేస్తున్నారు.

మహిళల రూపంపై సమాజం నిరంతరం పెట్టే ఒత్తిడి గురించి కూడా కీర్తి ఘాటుగా స్పందించారు. కొంచెం లావుగా ఉంటే బరువు తగ్గమంటారని, తీరా సన్నబడ్డాక మళ్లీ లావు అవ్వమంటూ ప్రజలు ఎప్పుడూ ఏదో ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తూనే ఉంటారని తప్పుపట్టారు. ఇటీవల కాలంలో తాను శారీరకంగా, మానసికంగా కొన్ని ఎదురుదెబ్బలను ఎదుర్కొన్నప్పటికీ, తన ఫిట్‌నెస్ ప్రయాణం నేర్పిన ఒకే ఒక్క ముఖ్యమైన సూత్రం.. “నేను ఎప్పటికీ పట్టుదల వదలను” అని ధీమాగా చెప్పారు. ఈ మెగా హీరోయిన్ చూపిస్తున్న అంకితభావం ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప స్ఫూర్తి అని చెప్పక తప్పదు.

Follow Us