
న్యాచురల్ స్టార్ నాని కెరీర్లో వన్ ఆఫ్ ది సూపర్ హిట్ మూవీ ‘నేను లోకల్’. డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ మూవీ 2017 ఫిబ్రవరి 3న విడుదలై విజయాన్ని అందుకుంది. ఇందులో నాని జోడిగా కీర్తి సురేష్ నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీ, స్క్రీన్ ప్రెజన్స్ జనాలకు తెగ నచ్చేసింది. అలాగే దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సైతం శ్రోతలను ఆకట్టుకుంది. ఈ మూవీ విడుదలైన నిన్నటి ఏడేళ్లు పూర్తైంది. ఈ సందర్బంగా కీర్తి సురేష్ ఇన్ స్టా స్టోరీలో ఆసక్తికర పోస్ట్ చేసింది. ఇక దాని మీద నాని ఇచ్చిన రియాక్షన్ కూడా వైరలవుతుంది. మనం కలిసి ఏడేళ్లకు పైగానే అవుతోంది రా.. ఈ ఏడేళ్లు అలా చిటికెలో గడిచినట్లు అనిపిస్తోంది. ఇంకా మనం కలిసి ఎన్నో సినిమాలు చేయాలి అన్నట్లుగా కీర్తి పోస్ట్ చేసింది. దీంతో నాని రియాక్ట్ అవుతూ.. నిన్ను ఇంకా ఇంకా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు నెట్టింట వైరలవుతున్నాయి.
నేను లోకల్ సినిమాతో ఏర్పడిన వీరిద్దరి పరిచయం బ్లాక్ బస్టర్ హిట్ దసరా వరకు కొనసాగుతూ వచ్చింది. సినీ పరిశ్రమలో వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కించిన దసరా సినిమాలోనూ వీరిద్దరు కలిసి నటించారు. ఈ మూవీ షూటింగ్ సెట్ లో వీరు కలిసి చేసిన అల్లరి వీడియోస్ తెగ వైరలయ్యాయి. అంతేకాకుండా ఇంటర్వ్యూలలో ఒకరిపై మరొకరు ఫన్నీ కౌంటర్స్ వేసుకోవడం చూస్తే ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ అర్థమవుతుంది. దసరా సినిమాకు కీర్తిని నాని సజెస్ట్ చేసినట్లుగా గతంలో ఆ మూవీ డైరెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.
Nani
ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో హిట్ అందుకున్నారు నాని. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది. తండ్రి కూతురు అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నాడు. అలాగే మరోసారి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వర్క్ చేయనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.