Keerthy Suresh: నా గుండె ముక్కలైంది.. ఎంతో బాధగా ఉంది.. కీర్తిసురేష్ ఎమోషనల్

సినీరంగంలో హీరోయిన్ కీర్తి సురేష్ కు మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో మహానటి సినిమాతు ఉత్తమ నటిగా ఏకంగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఇటీవలే బేబీ జాన్ సినిమాతో హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది

Keerthy Suresh: నా గుండె ముక్కలైంది.. ఎంతో బాధగా ఉంది.. కీర్తిసురేష్ ఎమోషనల్
Keerthy Suresh Emotional

Updated on: Mar 30, 2025 | 8:17 AM

అందాల భామ కీర్తిసురేష్ ఎమోషనల్ అయ్యింది. నా గుండె ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకూ కీర్తిసురేష్ ఎందుకు అంత ఎమోషనల్ అయ్యిందంటే.. కీర్తి సురేష్ ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించింది. ఇటీవలే ఈ చిన్నది పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. పెళ్లితర్వాత ఈ అమ్మడు కొత్త సినిమాను అనౌన్స్ చేయక పోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేస్తూ నెటిజన్స్ ను కవ్విస్తుంది. ఇటీవలే ఈ అమ్మడు బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. ఇక తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్ తాజాగా ఎమోషనల్ అయ్యింది. ఇంతకూ కారణం ఏంటంటే..

ఇటీవలే మయాన్మార్ లో జరిగిన భూకంపం గురించి అందరికి తెలిసిందే.. మయన్మార్‌ భూకంపంలో 1,725 మృతి చెందినట్టు తెలుస్తుంది. దాంతోఅక్కడి జీవనం అస్తవ్యస్తంగా మారింది. థాయ్ లాండ్, మయన్మార్ దేశాల్లో భూకంపం సంభవించడంతో ప్రాణనష్టంతో పాటు ఆస్థి నష్టం కూడా భారీగా ఏర్పడింది. దాంతో ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కీర్తిసురేష్ కూడా మయన్మార్ భూకంపం పై దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఈమేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కీర్తిసురేష్.

మయన్మార్, థాయ్ లాండ్‌లో భీకర పరిస్థితులు ఏర్పడ్డాయి.. అక్కడ భూకంపం రావడంతో అంతా చెల్లాచెదురైంది.. అక్కడి ప్రజల గురించి తల్చుకుంటూ ఉంటే.. నా గుండె ముక్కలైనంత భాదగా ఉంది.. గుండె తరుక్కుపోతుంది. అక్కడి పరిస్థితులు త్వరగా కుదుటపడాలి, అక్కడి ప్రజలు త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా అంటూ కీర్తి సురేష్ ఎమోషనల్ అయింది. కీర్తిసురేష్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గ మారింది.

కీర్తిసురేష్ ఇన్ స్టార.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.