ఓటీటీ లో కీర్తిసురేష్ మొదటి సినిమా.. ఎన్నాళ్లకెన్నాళ్లకో …

మహానటి సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న భామ కీర్తి సురేష్. టాలీవుడ్ లో మొదటిసినిమా నేను శైలజ సినిమాతో కుర్రాళ్ల కలల  రాకుమారిగా మారిన ఈ చిన్నది ఆతర్వాత..

ఓటీటీ లో కీర్తిసురేష్ మొదటి సినిమా.. ఎన్నాళ్లకెన్నాళ్లకో ...
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 25, 2020 | 3:14 PM

మహానటి సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న భామ కీర్తి సురేష్. టాలీవుడ్ లో మొదటిసినిమా నేను శైలజ సినిమాతో కుర్రాళ్ల కలల  రాకుమారిగా మారిన ఈ చిన్నది ఆతర్వాత మహానటి సినిమాలో సావిత్రిగా నటించి సినిమాప్రేమికులను నటనతో కట్టిపడేసింది. ఆ తరువాత వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ.. దూసుకుపోతుంది కీర్తి. ఇటీవల వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది.

ఇటీవల ఓటీటీ వేదికగా పెంగ్విన్ , మిస్ ఇండియా  సినిమాలతో ప్రేక్షకులను అలరించిన కీర్తి  ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ కు జోడీగా ‘రంగ్ దే’ సినిమాచేస్తుంది .  అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సర్కారువారిపాట’ సినిమా లో నటిస్తుంది. జనవరి మొదటివారం నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది. ఇదిలా ఉంటే  మనకు తెలిసి తెలుగులో కీర్తి  సురేష్ మొదటి సినిమా ‘నేను శైలజ’ కానీ ఈ సినిమా కంటే ముందే ఈ అమ్మడు  సీనియర్ నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ సరసన ‘ఐనా ఇష్టం నువ్వు’ అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా అనుకొని కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు . ఇక ప్రస్తుతం ఓటీటీ హవా సడుస్తుండటంతో ఇప్పుడు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.  రెండు జ‌ళ్ళ సీత అనే టైటిల్ తో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి