ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరనస నేను శైలజ సినిమాతా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో కిర్తీ నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా సొంతం చేసుకుంది. మహానటి మూవీ తర్వాత కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. ఈ మూవీతోపాటు.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో చిరు చెల్లెలుగా నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం గుడ్ లక్ సఖి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 10న విడుదల కావాల్సి ఉంది. కానీ అనుహ్యా కారణాల వలన ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్రయూనిట్. గుడ్ లక్ సఖి సినిమాను డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గుడ్ లక్ సఖి సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర పదిరి నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Due to unforeseen issues, #GoodLuckSakhi is arriving on the New Year’s Eve (31st Dec 2021)?
We are working hard to bring this with lots of love?
Stay with us!#GoodLuckSakhiOn31stDec@KeerthyOfficial @AadhiOfficial @ThisIsDSP #NageshKukunoor #DilRaju @sudheerbza @shravyavarma pic.twitter.com/c9IAv2wPFq— Worth A Shot (@WorthAShotArts) December 5, 2021
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ షోలో ముగిసిన ప్రియాంక ప్రయాణం.. ఎంత పారితోషకం అందుకుందంటే..