తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో ‘ఉద్యమ సింహం’

| Edited By:

Mar 18, 2019 | 3:17 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఉద్యమ సింహం’. నటరాజన్, మాధవీ రెడ్డి, జలగం సుధీర్, లత, పీఆర్‌ విటల్‌ బాబు, సూర్య ముఖ్య పాత్రల్లో నటించారు. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కల్వకుంట్ల నాగేశ్వర రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. చిత్ర నిర్మాత‌ కల్వకుంట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ఉద్యమ సింహం’ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్‌ నేతృత్వంలో సాగిన అంశాల నేపథ్యంగా […]

తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో ఉద్యమ సింహం
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఉద్యమ సింహం’. నటరాజన్, మాధవీ రెడ్డి, జలగం సుధీర్, లత, పీఆర్‌ విటల్‌ బాబు, సూర్య ముఖ్య పాత్రల్లో నటించారు. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కల్వకుంట్ల నాగేశ్వర రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది.

చిత్ర నిర్మాత‌ కల్వకుంట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ఉద్యమ సింహం’ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్‌ నేతృత్వంలో సాగిన అంశాల నేపథ్యంగా తెరకెక్కించిన కథ. కేసీఆర్‌ పాత్రలో నటరాజన్‌ చక్కగా ఒదిగిపోయారు’’అని ప్రశంసించారు. ‘‘ప్రత్యేక తెలంగాణ కోసం ఎందరో ఉద్యమాలు నడిపారు కానీ ఒక్క కేసీఆర్ గారు మాత్రమే పోరాడి తెలంగాణాను సాధించారు. ఈ సినిమా తప్పకుండా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని కృష్ణంరాజు అన్నారు.