
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఇటీవలే పెళ్లిపీటలెక్కిన విషయం తెలిసిందే. హిందీ యంగ్ హీరో విక్కీ కౌశల్ ను కత్రినా పెళ్లాడిన విషయం తెలిసిందే.. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కత్రినా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. వరుసగా రెండేళ్లలో రెండు సినిమాలు చేసి.. ఆ తర్వాత మళ్లీ ఇటువైపు చూడలేదు. ఇదిలా ఉంటే 2021, డిసెంబర్ 9న కత్రినా, విక్కీల వివాహం జరిగింది. కాగా పెళ్లి తర్వాత సినిమా షూటింగులతో మళ్లీ బిజిబిజీగా మారిపోయారీ లవ్లీ కపుల్. కాగా వీరిద్దరు సిల్వర్ స్ర్కీన్‌పై జంటగా ఒకసారి కూడా కనిపించలేదు. మొన్నామధ్య ఓ యాడ్ షూటింగ్ లో ఈ ఇద్దరు కలిసి కనిపించారు. పెళ్లి తర్వాత కూడా సినిమాలతో బిజీగా ఉన్న కత్రినా ఇప్పుడు తల్లి కాబోతుందని తెలుస్తోంది.
కత్రినా కైఫ్ గర్భవతి అనే విషయం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. లూజైన దుస్తులను ధరించి కనిపించింది కత్రినా. దీనికి సంబంధించిన ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. కత్రినా వదులైన దుస్తులు ధరించినప్పటికీ ఆమె పొట్టభాగం ఎత్తుగా కనిపించింది.
దాంతో కత్రినా తల్లి కాబోతుందంటూ వాగర్థాలు వినిపిస్తున్నాయి. కాబట్టి కత్రినా కైఫ్ తన గర్భాన్ని దాచి పెడుతుందని కొందరు అంటున్నారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదు అని మరికొంతమంది అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
Katrina Kaif